“సైరా”లో జగపతిబాబు మోషన్ టీజర్

February 12, 2019 at 3:26 pm

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో సినిమా రూపుదిద్దుకుంటోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెర కెక్కుతున్న చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవ‌ల జార్జియాలో వేసిన భారీ సెట్‌లో పోరాట స‌న్నివిశాల‌ను చిత్రీక‌రించారు.52008524_358073761457021_5400332590538293248_n

ఒక‌ప్ప‌టి ఫ్యామిలీ హీరో, ఇప్ప‌టి స్టైలిష్ విల‌న్ జగ‌ప‌తి బాబు ఈ సినిమాలో వీరారెడ్డి పాత్ర పోషిస్తున్నారు. మంగ‌ళ‌వారం జగపతిబాబు పుట్టినరోజు సంద‌ర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుకను ఇచ్చింది ‘సైరా’ యూనిట్. ఈ చిత్రంలోని ఆయ‌న‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుద‌ల చేసింది. గ‌తంలో ఎప్పుడూ చూడని సరికొత్త గెటప్‌లో జగ‌ప‌తిబాబు విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. భుజాల వరకూ జుట్టూ, బాగా పెరిగిన గడ్డం, మీసాలతో వినూత్నంగా ద‌ర్శ‌న‌మిస్తున్నారు. నుదుటన బొట్టుతో ఉగ్రరూపందాల్చి అహో అనిపించేదిగా ఉంది జగపతిబాబు లుక్. ఇంకా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇప్ప‌టికే ఈ చిత్రంపై అటు మెగా అభిమానుల్లో , ఇటు ప‌రిశ్ర‌మ‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. చిరంజీవి న‌టించిన ఖైదీ నంబ‌ర్ 150 సినిమా 2017 సంక్రాంతికి విడులైంది. ఆ త‌ర్వాత రెండేళ్ల విరామంతో చిరు ఉయ్యాలవాడ న‌ర్సింహారెడ్డిగా ప్రేక్ష‌కుల మ‌ధ్య‌కు వ‌స్తుండ‌టంతో ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఆగ‌స్టు 15కి సినిమాను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల మోతమోగ‌డం ఖాయ‌మ‌ని మెగా ఫ్యాన్స్ తో పాటు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

“సైరా”లో జగపతిబాబు మోషన్ టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share