సైరా టీంలో టెన్ష‌న్‌..ఆ ప్లాన్ వ‌ర్కౌట్ అవుతుందా..!

March 8, 2019 at 1:23 pm

సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా మేకింగ్‌లో ఏం జ‌రుగుతుందో తెలియ‌దుగానీ.. చిత్ర‌యూనిట్‌లో మాత్రం కొంత ఆందోళ‌న కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే.. బ‌డ్జెట్ ఏమో అమాంతంగా పెరిగిపోతోంది. ఇప్ప‌టికే అంచ‌నా దాటిపోయింది. చిరంజీవి హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాకు ఆయ‌న త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న విష‌యం తెలిసిందే. రాంచ‌ర‌ణ్ అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా ఈ ప్రాజెక్టుని తీసుకుని.. డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌డంలో ఏమాత్ర‌మూ వెనుక‌డుగు వేయ‌డం లేదు. దీంతో బ‌డ్డెట్ ఊహించ‌ని రీతిలో పెరిగిపోయింద‌ట‌.

అయితే.. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాకు సంబంధించిన బిజినెస్ విష‌యంలో మాత్రం ప‌రిస్థితులు అంత ఆశాజ‌నకంగా లేన‌ట్లు తెలుస్తోంది. విడుద‌లకు ముందే మాంచి బిజినెస్ రాబ‌ట్టుకోవాల‌ని రాంచ‌ర‌ణ్ చూస్తున్నార‌ట‌. కానీ.. శాటిలైట్‌, ఇత‌ర డ‌బ్బింగ్, ఓవ‌ర్సీస్‌ హ‌క్కులకు సంబంధించి చ‌ర్చ‌లు మాత్రం అస్స‌లు కొలిక్కిరావ‌డం లేదట‌. ఈ సినిమాను కోట్లుగుమ్మ‌రించేందుకు ఎవ‌రూ అంత సుముఖంగా లేన‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో చిత్ర‌యూనిట్ కొంత ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. అయితే.. దీని నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు స‌రికొత్త ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఏకంగా హీరో చిరంజీవితోనే ఓ ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. చిరంజీవిని రాంచ‌ర‌ణ్ ఇంట‌ర్వ్యూ చేసే ఈవెంట్‌తో సినిమాపై హైప్ క్రియేట్ చేస్తే.. అప్పుడుగానీ.. అనుకున్నంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేయొచ్చున‌న్న ఆలోచ‌న‌లో చిత్ర‌యూనిట్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చించి, అంచానాలను అమాంతంగా పెంచేసి.. విడుద‌ల‌కు ముందే కోట్ల బిజినెస్ చేయాల‌ని చూస్తున్న రాంచ‌ర‌ణ్ ప్లాన్ ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి మ‌రి.

సైరా టీంలో టెన్ష‌న్‌..ఆ ప్లాన్ వ‌ర్కౌట్ అవుతుందా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share