దుమ్మురేపుతున్న ‘టాక్సీవాలా’కలెక్షన్లు

November 19, 2018 at 4:38 pm

టాలీవుడ్ లో కేవలం మూడు సినిమాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన యూత్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గత నెల ‘నోటా’సినిమాతో ఫ్లాప్ అందుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ‘టాక్సీవాలా’తో మంచి విజయం అందుకున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో హిట్ చిత్రాల యువ కథానాయకుడిగా పేరు గాంచిన విజయ్ దేవరకొండ.

హర్రర్, థ్రిల్లర్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. మొదటిషోతోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను రూ.6 కోట్ల 32 కోట్ల షేర్ ని దాటేసి దూకుడు ప్రదర్శిస్తోంది. జీఏ2 పిక్చర్స్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రంపై పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

ప్రియాంక జవాల్కర్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మాళవికా నాయర్‌, కళ్యాణి, ఉత్తేజ్‌ మొదలైనవారు ప్రధాన పాత్రలు పోషించారు. మరో పది రోజుల వరకు మరే సినిమాలు పోటీ లేకపోవడంతో లాంగ్ రన్ లో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకొని రూ.9 కోట్ల 12 లక్షలు షేర్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

ఏరియాల వారీ సినిమా కలెక్షన్లు :
నైజాం………………………………. రూ.2 కోట్ల 76 లక్షలు
సీడెడ్………………………………… రూ.80 లక్షలు
ఉత్తరాంధ్ర………………………… రూ.76 లక్షలు
గుంటూరు………………………….. రూ.53 లక్షలు
ఈస్ట్……………………………………… రూ.39 లక్షలు
వెస్ట్……………………………………….. రూ.35 లక్షలు
నెల్లూరు……………………………….. రూ.21 లక్షలు
కృష్ణా………………………………………. రూ.52 లక్షలు

ఏపి+తెలంగాణ మొత్తం : రూ.6.32 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ.1.75 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం : రూ.9.12 కోట్లు

దుమ్మురేపుతున్న ‘టాక్సీవాలా’కలెక్షన్లు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share