TJ రివ్యూ: ఆక్సిజ‌న్‌

November 30, 2017 at 4:38 pm

TJ రివ్యూ: ఆక్సిజ‌న్‌

టైటిల్‌: ఆక్సిజ‌న్‌

బ్యాన‌ర్‌: శ్రీ సాయిరామ్ క్రియేష‌న్స్‌

న‌టీన‌టులు: గోపీచంద్‌, అను ఇమ్మాన్యుయేల్‌, రాశి ఖ‌న్నా, జ‌గ‌ప‌తిబాబు, శామ్‌, అశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, అభిమ‌న్యు సింగ్‌, వెన్నెల‌కిషోర్‌, అలీ, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు

మ్యూజిక్‌: యువ‌న్ శంక‌ర్ రాజా

సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు, వెట్రి

ఎడిటింగ్‌: ఎస్‌.బి.ఉద్ధ‌వ్‌

నిర్మాత: ఐశ‌్వ‌ర్య‌.ఎస్‌

ద‌ర్శక‌త్వం: ఎ.ఎం.జోతికృష్ణ‌

రిలీజ్ డేట్‌: 30 న‌వంబ‌ర్‌, 2017

లౌక్యం సినిమా త‌ర్వాత గోపీచంద్‌కు స‌రైన హిట్ లేదు. ఈ యేడాది గౌత‌మ్‌నందా సినిమాతో ప్లాప్ ఎదుర్కొన్న గోపీ న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఆక్సిజ‌న్‌. ఎప్పుడో నీ మ‌న‌సు నాకు తెలుసు అనే సినిమాను డైరెక్ట్ చేసిన ఎ.ఎం.ర‌త్నం త‌న‌యుడు ఎ.ఎం.జోతికృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప‌లుసార్లు వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోన్న ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మ‌రి ఆక్సిజ‌న్ గోపీచంద్‌కు హిట్ ఇచ్చిందో ?  లేదో ?  స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :

ఆర్మీలో ప‌నిచేసే సంజీవ్ (గోపీచంద్‌) మూడేళ్ల త‌ర్వాత సొంత ఊరికి వ‌స్తాడు. తాను ప్రేమించిన గీత (అను ఎమ్మాన్యుయేల్‌)తో త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. సంజీవ్‌ త‌మ్ముడి చావుకు టైగ‌ర్ బ్రాండ్ సిగ‌రెట్ కార‌ణ‌మ‌వుతుంది. దీంతో దాని య‌జ‌మానిపై ప‌గ తీర్చుకోవాల‌ని సంజీవ్ చూస్తుంటాడు. ఇదిలా ఉంటే కృష్ణ ప్ర‌సాద్ ( గోపీచంద్‌) పెళ్లి చూపుల కోసం అమెరికా నుంచి రాజ‌మండ్రికి వ‌స్తాడు. అక్క‌డ ఊరి పెద్ద ర‌ఘుప‌తి (జ‌గ‌ప‌తిబాబు) కుమార్తె శృతి (రాశీఖ‌న్నా)ను చూసి ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకోవ‌డానికి అంగీక‌రిస్తాడు. ర‌ఘుప‌తికి ఆ ఊర్లోని ఇంకో వ్య‌క్తి (సాయాజీ షిండే) ఫ్యామిలీతో గొడ‌వ ఉంటుంది. ఈ గొడ‌వ‌ల్లో ర‌ఘుప‌తి అన్న‌, అన్న కొడుకు, అల్లుడు చ‌నిపోయార‌ని అనుకుంటారు. అయితే వీళ్ల‌ను చంపింది అత‌డు కాదు మ‌రో ఇద్ద‌రు అన్న నిజం తెలుస్తుంది. ఆ ఇద్ద‌రికి సంజీవ్ బాస్‌. అస‌లు సంజీవ్ ఎవ‌రు ? అత‌డికి కృష్ణ‌ప్ర‌సాద్‌కు లింక్ ఏంటి ?  సంజీవ్ ఎవ‌రిని టార్గెట్ చేశాడు ?  కృష్ణ ప్ర‌సాద్‌కు శృతికి పెళ్లి జ‌రిగిందా ?  చివ‌ర‌కు ఈ క‌థ‌లో మ‌లుపులు ఎలా ట‌ర్న్ అయ్యాయి ? అన్న‌దే ఈసినిమా స్టోరీ.

న‌టీన‌టుల పెర్పామెన్స్ & TJ విశ్లేష‌ణ‌:

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే గోపీచంద్ – రాశీఖ‌న్నా జోడీ బాగుంది. అనూ ఎమ్మాన్యుయేల్ గ్లామ‌ర్‌గా క‌నిపిస్తూ ఇంప్రెస్ చేసింది. గోపీ లుక్ బాగున్నా అత‌డు ఈ సినిమాలో కొత్తగా చేయ‌డానికి ఏం లేదు. జ‌గ‌ప‌తిబాబు అటు ప‌ల్లెటూరి మ‌నిషిగాను, డాన్‌గా ఆక‌ట్టుకున్నాడు. మిగిలిన వాళ్ల గురించి చెప్పుకోవ‌డానికి ఏం లేదు. ఈ సినిమా క‌థ చాలా మంచి పాయింట్‌తో ద‌ర్శ‌కుడు అల్లుకున్నాడు. మ‌నం ప్ర‌తి సినిమా ప్రారంభంలో చూపించే మ‌ద్య‌పానం, ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అనే అంశంతో త‌యారైన క‌థ ఇది. స‌మాజంలోకి ఇష్టానుసారం వ‌స్తోన్న సిగ‌రెట్ల‌కు యువ‌త ఎలా వ్య‌స‌నానికి గుర‌వుతున్నారు ?   వీటి వ‌ల్ల యువ‌త ఎలాంటి వ్యాధుల‌కు గుర‌య్యి ప్రాణాలు కోల్పోతున్నార‌న్న అన్న మంచి కాన్సెఫ్ట్‌ను తీసుకున్నారు. అయితే ఈ మెయిన్ పాయింట్ చుట్టూ ద‌ర్శ‌కుడు అల్లుకున్న సీన్లు తెలుగు సినిమాల్లో చాలా పాత సినిమాల‌ను కాపీ కొట్టేసిన‌ట్టే ఉంటాయి. ఆగ‌డు, మిర్చి సినిమాల నుంచి కొన్ని సీన్లు ఎత్తేశాడు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ బాగుంది…సెకండాఫ్‌లో సినిమా ఎలా ఉంటుంద‌న్న ఆసక్తి పెరుగుతుంది. సినిమా స్పీడ్ అందుకున్నా చాలా చోట్ల డ్రాప్ అవుతుంది. ఇక మైన‌స్ పాయింట్ల విష‌యానికి వ‌స్తే క‌థ‌కు అవ‌స‌రం లేని సీన్లు చాలా వ‌ర‌కు అల్లుకుని దాని చుట్టూ క‌థ న‌డిపించి సినిమా సాగ‌దీసేశాడు. పాట‌లు బాగోలేదు. ఇక ఒక‌డు త‌ప్పు చేస్తే వాటి కుటుంబానికి ద‌గ్గ‌రై వాడి కుటుంబాన్ని అంతం చేసే స్టోరీలు చాలా వ‌చ్చాయి. ఈ సినిమాలోను హీరో అదే చేశాడు. చాలా సీన్లు ముందే సుల‌భంగా ఊహించేయ‌వ‌చ్చు. 

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :

ఇక టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే యువ‌న్ శంక‌ర్ రాజా మ్యూజిక్ ఫెయిల్‌. పాట‌లు ఆక‌ట్టుకోలేదు. చిన్నా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఉద్ద‌వ్ ఎడిటింగ్ ఫ‌స్టాఫ్‌లో చాలాసీన్లు క‌ట్ చేయాల్సిన‌వి చాలానే ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ఇక ద‌ర్శ‌కుడు జ్యోతికృష్ణ ప‌దేళ్ల త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్టి ఓ అవుట్ డేటెడ్ క‌థ‌తో తీసిన సినిమాయే ఆక్సిజ‌న్‌.

TJ ఫైన‌ల్ పంచ్‌:  రొటీన్ రెగ్యుల‌ర్ ఆక్సిజ‌న్‌

TJ ఆక్సిజ‌న్ మూవీ రేటింగ్‌:  1.75 / 5

TJ రివ్యూ: ఆక్సిజ‌న్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share