జర్నలిస్ట్ ను గెస్ట్ హౌస్ కి రమ్మన్నటాలీవుడ్ స్టార్ హీరో!

October 10, 2018 at 12:07 pm

ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ గా కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లతో పాటు ఇతర విభాగాల్లో ఉన్న వారు కూడా తమ పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కటీ రివీల్ చేస్తున్నారు. ఆ మద్య కాస్టింగ్ కౌచ్ విషయంలో నటి శ్రీరెడ్డి పెద్ద ఎత్తున్న ఉద్యమం తీసుకు వచ్చినా..కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గింది. కానీ సోషల్ మీడియాలో లో తన అభిప్రాయాలను వెల్లబుచ్చుతూనే ఉంది. ఈ మద్య బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఏకంగా తెలుగు మీడియాకు చెందిన ఓ మహిళా ఉద్యోగి బయటకొచ్చారు.

గతంలో తనపై జరిగిన కాస్టింగ్ కౌచ్ ఉదంతాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టారు. పెళ్లికి ముందు టాలీవుడ్ లో సినిమా జర్నలిస్ట్ గా పనిచేసిన తనను ఓ హీరో లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది. ఓ నైట్ పార్టీలో తన తో అసహ్యంగా వ్యవహరించాడని.. పలుమార్లు గెస్ట్ హౌజ్ కు పిలిచాడని చెప్పుకొచ్చింది. అంతే కాదు ఆరోజు పార్టీలో తను మద్యం సేవించమని ఎన్ని సార్లు ప్రయత్నించినా..తాను మాత్రం మద్యం సేవించలేదని..అలాగే గెస్ట్ హౌజ్ కూడా వెళ్లలేదని చెప్పింది.

తన పెళ్లికి 2 రోజుల ముందువరకు ఆ ‘కల్ట్ హీరో’ తనకు ఫోన్ చేసేవాడని, ఒక్కసారి కలవాలి రమ్మని తనతో ఒక్కరోజు ఎంజాయ్ చేయమని బలవంత పెట్టాడని పేర్కొంది. అయితే తనకు పెళ్లి కుదిరిందని చెప్పిన తర్వాత అతని నుంచి ఫోన్లు, మెసేజ్ లు రావడం ఆగిపోయాయని చెప్పింది. మహిళా జర్నలిస్ట్ ఈ వివరాలు బయటపెట్టిన వెంటనే ఆ ‘కల్ట్ హీరో’ ఎ వరనే అంశంపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. కొంతమంది మెగాహీరోలతో పాటు నందమూరి హీరోల పేర్లు కూడా తెరపైకి రావడంతో రచ్చ పీక్ స్టేజ్ కు చేరిపోయింది.

దాంతో ఆ మహిళా జర్నలిస్ట్ ని టార్గెట్ చేసి ఫ్యాన్స్ రక రకాలుగా ట్రోలింగ్ చేయడంతో తప్పని సరి పరిస్థితుల్లో పోస్టును ఆమె తొలిగించింది. తనను ఇండస్ట్రీలో కొనసాగనివ్వరని, తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందంటూ పెట్టిన పోస్టులు తీయాల్సి వచ్చిందని వాపోయింది. ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతున్నాయని..అవి ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని పేర్కొంది.

జర్నలిస్ట్ ను గెస్ట్ హౌస్ కి రమ్మన్నటాలీవుడ్ స్టార్ హీరో!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share