తెలుగు టాప్ హీరోయిన్నుచావా బాదిన ప్రియుడు

October 9, 2018 at 4:41 pm

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ పై నటీమణులు, సింగర్స్ మరికొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గతంలో తమపట్ల జరిగిన అన్యాయాన్ని ముక్తకంఠంతో విమర్శిస్తున్నారు. మొన్నటి వరకు తెలుగు నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేసిన విషయం తెలిసిందే. సినిమాల్లో నటించాలంటే కొంత మందికి పడక సుఖం ఇవ్వాలని..లేదంటే ఛాన్స్ లు రావని బాహాటంగా చెప్పింది. ఇప్పుడు బాలీవుడ్ లో సైతం కాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నటి తనుశ్రీ దత్తా, కంగనా రౌనత్ లు తమ పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియా సాక్షిగా ఆరోపిస్తున్నారు.flora-saini-759

తాజాగా ఫ్లోరా షైనీ తాను ఓ నిర్మాత వల్ల ఎంతగా నరకం అనుభవించానో ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన పిక్స్‌ను పంపించి మరీ ఆరోపిస్తుంది. ఫ్లోరా షైనీ మాజీ ప్రియుడు, నిర్మాత గౌరంగ్ దోషి గతంలో తనపై అత్యంత తారుణంగా ప్రవర్తించాడని ఆరోపించింది. 2007లో ప్రేమికుల దినోత్సవం నాడు గౌరంగ్ దోషి నన్ను దారుణంగా కొట్టాడు. ఒక సంవత్సరం పాటు నాకు నరకం చూపించాడు. అప్పుడు నా దవడ ఫ్రాక్చర్ అయింది. ఆ సమయంలో నేను ఇదంతా బయటపెట్టాను. కానీ ఎవ్వరూ నమ్మేవారు కాదు. అప్పట్లో గౌరంగ్ దోషి కి ఇండస్ట్రీలో మంచి పలుకుబడి ఉండేది..దాంతో నా బాధ ఎవరూ పట్టించుకోలేదు. Flora-Saini

అంతే కాదు నాలా ఎంతో మంది అమ్మాయిలు అతని వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారంతా నాకు ఫోన్లు చేసి సాయం చేయమని అడిగారు. కానీ నేను ఆ ధైర్యం చేయలేకపోయాను. తమ పట్ల జరిగిన దారుణాల గురించి బయటపెడుతున్నవారి కోసం నేను ఈ పోస్ట్‌ పెడుతున్నాను. గౌరంగ్‌ వల్ల నా జీవితంలో చాలా నష్టపోయాను. ఆ ఘటన తర్వాత నా జీవితంలో నేను బాగుచేయలేని మార్పులు చోటుచేసుకున్నాయి. ఆత్మస్థైర్యంతో పోరాడే వారికి దేవుడు కూడా అనుకూలిస్తాడని.. మళ్లీ మనమంతా సంతోషంగా ఉందాం. ఇలాంటి వారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం అని వెల్లడించారు ఫ్లోరా.

తెలుగు టాప్ హీరోయిన్నుచావా బాదిన ప్రియుడు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share