తెలుగు కుర్ర హీరోల కొట్లాట!

October 12, 2018 at 11:16 am

ఈ మద్య టాలీవుడ్ లో యంగ్ హీరోల హవా పెరిగిపోయింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హోదా దక్కించుకున్న కుర్ర హీరో విజయ్ దేవరకొండ. ఈ మద్య రిలీజ్ అయిన ‘గీతాగోవిందం’సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక కార్తికేయ చిత్రంతో మొదలైన విజయాలు..మొన్నటి కేశవ వరకు కొనసాగుతూ వచ్చాడు..కుర్ర హీరో నిఖిల్. ఇదిలా ఉంటే రీసెంట్ గా ‘నోటా’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఈసారి మెప్పించలేక పోయాడు. దాంతో నోటాపై రక రకాల కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఈ సినిమా పై స్పందిస్తూ..ఓ ట్విట్ చేశాడు.

నేను క్షమాపణలు కోరను. బాధ్యత తీసుకుంటా. ‘నోటా’ విషయంలో గర్వపడుతున్నా. నేను చెప్పాలనుకున్న కథ ఇది. తమిళనాడు, జాతీయ మీడియాకు చిత్రం నచ్చింది. అలాగే, చిత్రంపై వచ్చిన విమర్శల్ని సీరియస్‌గా తీసుకున్నా. నా నిర్ణయాల్ని విశ్లేషించి తప్పుల్ని సరిచేసుకున్నా. మొదటి నుంచి నా యాటిట్యూడ్ ఇలాగే ఉంటుంది..ఎవరి కోసం మారను. జయాపజయాలు ఓ రౌడీని తయారు చేయలేవు, తుంచలేవు. రౌడీగా ఉండటం అంటే గెలవడం మాత్రమే కాదు. గెలుపు కోసం పోరాటం మన వ్యక్తిత్వాన్ని చంపుకోవొద్దు అంటూ సో, రౌడీస్‌… పోరాటం చేస్తూ ఉండండి. ఈ పరాజయాన్ని చూసి సంబరాలు చేసుకుంటున్న వారి కోసం… ఇప్పుడు పండగ చేస్కోండి. ఐ విల్‌ బి బ్యాక్‌ భారీ డైలాగ్స్ తో ట్విట్ చేశాడు.

ఈ ట్విట్ చేసిన కొద్ది సేపటి తర్వాత యంగ్ హీరో నిఖిల్ తానూ ఓ ట్విట్ చేశాడు. ప్రపంచమంతా తమ చుట్టూ తిరుగుతుందని భావించే వాళ్ల కోసం… అనవసరంగా యాటిట్యూడ్‌ చూపించే వాళ్ల కోసం… డ్యూడ్‌, నువ్వేమంత ఇంపార్టెంట్‌ కాదు. ప్రతి నటుడు తనతో తాను పోటీ పడతాడు. మనమంతా మూవీ మేకింగ్‌ అనే సముద్రంలో నీటిబొట్టు వంటి వాళ్లమే. వర్క్‌ మోర్‌ అంటూ ట్విట్ చేశాడు. అయితే ఇది విజయ్ దేవరకొండను ఉద్దేశించి పెట్టాడని విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దాంతో కాసేపటి తర్వాత తన ట్విట్ డిలీట్ చేశాడు. అయితే తానుమాత్రం ఈ ట్విట్ ఎవరినీ ఉద్దేశించి పెట్టలేదని..వరికీ వ్యతిరేకంగా ఆ ట్వీట్‌ చేయలేదనీ, ఓ అంశాన్ని ఎలానైనా మార్చవచ్చనీ అర్థమైందనీ నిఖిల్‌ మరో ట్వీట్‌ చేశారు.

తెలుగు కుర్ర హీరోల కొట్లాట!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share