అర‌వింద స‌మేత‌లో.. ఆ హాలివుడ్ సీక్వెన్స్‌…

October 15, 2018 at 10:05 am

హాలివుడ్ సినిమాల్లోని ప‌లు సీన్ల‌ను, పాట‌ల‌ను టాలీవుడ్ డైరెక్ట‌ర్లు కాపీ కొడుతున్నార‌నే టాక్ చాలాకాలంగానే ఉంది. ఆ సినిమాల్లోని సీక్వెన్స్‌ను మ‌న ద‌ర్శ‌కులు మ‌క్కీకి మ‌క్కీ తెలుగు సినిమాల్లో దించేస్తున్నారు. ఈ మ‌ధ్య ఈ ధోర‌ణి మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇక పాట‌ల్ని కూడా కాపీ కొడుతున్నార‌నే అప‌వాదు టాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుల‌పై ఉంది. అయితే.. ఆ హాలివుడ్ సినిమాల‌ను స్ఫూర్తిగా తీసుకున్నార‌ని అనుకున్నా.. అది కాపీగా క‌న‌బడుతోంది. తాజాగా.. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమాలో హాలీవుడ్ సీక్వెన్స్ ఉంద‌నే టాక్ వినిపిస్తోంది.A466887_gal_20180330163224

త్రివిక్ర‌మ్‌-ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి సినిమా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌. హారిక హాసిని క్రియేష‌న్ నిర్మాణంలో వ‌చ్చిన ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ఈనెల 11న విడుద‌ల అయి థియేట‌ర్ల‌లో దుమ్ము దులుపుతోంది. వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. అయితే.. ఈ సినిమాలో హాలివుడ్ సీక్వెన్స్ ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. దీనిని త్రివిక్ర‌మ్ మ‌క్కీకి మ‌క్కీ దించ‌క‌పోయినా.. కొంచెం అటు ఇటుగా మార్చి చూపించాడు. అదేమిటంటే.. అర‌వింద సినిమాలో ఎన్టీఆర్ పాఠ‌శాల విద్యార్థికి క‌థ చెప్ప‌డం.. స్కూల్ మ్యాగ‌జైన్‌లో అచ్చుకావ‌డం.. అది పోయిపోయి.. విల‌న్ జ‌గ‌ప‌తి బాబు చేతిలో ప‌డ‌డం.. ఇక ఎన్టీఆర్ కోసం వెటాడ‌డం తెలిసిందే.DpdfVThXUAAjDXJ

ఈ సీక్వెన్స్‌.. 2013లో వ‌చ్చిన ఫ్యామిలీ సినిమాలోని అనే టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాలో కూడా రాబ‌ర్ట్ అనే మాజీ మాఫియా డాన్‌ ఎవ‌రికీ తెలియ‌ని ప్రాంతంలో త‌ల‌దాచుకోవ‌డం.. అనుకోకుండా.. త‌న కుమారుడికి త‌న అనుభ‌వాన్నేక‌థ‌గా చెప్ప‌డం..అది స్కూల్ మ్యాగ‌జైన్‌లో అచ్చుకోవ‌డం.. ఆ త‌ర్వాత అది విల‌న్‌కు తెలియ‌డం.. ఇలా ఈ సినిమా సీక్వెన్స్‌ను త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమాలో దించాడు. కాక‌పోతే.. కొంచెం మార్చి.. మిగ‌తాదంతా సేమ్‌టుసేమ్‌. ఇక దీనిపై అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక‌రేమో స్ఫూర్తిగా తీసుకున్నార‌ని అంటే.. మ‌రొక‌రేమో.. ఇలా కాపీ కొడుతారా..? అంటూ కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

అర‌వింద స‌మేత‌లో.. ఆ హాలివుడ్ సీక్వెన్స్‌…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share