టాలీవుడ్‌లో ఈ శుక్ర‌వారం పెద్ద సంచ‌ల‌నం

శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు ఇండియాలోని అన్ని భాష‌ల్లో సినిమాలు వ‌రుస‌పెట్టి థియేట‌ర్ల‌లోకి క్యూ క‌ట్టేస్తాయి. ఇక తెలుగులో అయితే ఇటీవ‌ల కాలంలో ఒకే రోజు రెండు మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కేవ‌లం పండ‌గ సీజ‌న్‌లో మాత్ర‌మే కాదు. మిగిలిన సీజ‌న్ల‌లో కూడా శుక్ర‌వారం రెండు మూడు సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగిపోతున్నాయి. ఈ శుక్ర‌వారం అయితే ఏకంగా నాలుగు సినిమాలు వ‌చ్చాయి. 

ఇక వ‌చ్చే శుక్ర‌వారం టాలీవుడ్‌లో పెద్ద సంచ‌ల‌నం జ‌ర‌గ‌బోతోంది. న‌వంబ‌ర్ 17న ఏకంగా 13 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటి వరకు ఒకే రోజు రెండు, మూడు లేదంటే నాలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అవడాన్నే విశేషంగా భావించేవారు. అయితే ఇప్పుడు ఏకంగా ఒకే రోజు 13 సినిమాలు రావ‌డంతో ఏ సినిమా చూడాలో తెలియ‌క ప్రేక్ష‌కుడు క‌న్‌ఫ్యూజ్‌కు గుర‌వ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

ఈ 13 సినిమాల్లో గోపీచంద్ ఆక్సిజ‌న్ – కార్తీ ఖాకీ – లండన్ బాబులు – సిద్ధార్థ్ గృహం – దేవి శ్రీ ప్రసాద్ – ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం – శివబాలాజీ స్నేహమేరా జీవితం – ప్రేమతో మీ కార్తిక్ – ది లాస్ట్ హర్రర్ – బేబీ –  లవర్స్ క్లబ్ – డేర్ టు డ్రీమ్ – జస్టీస్ లీగ్ ఉన్నాయి.

అయితే గోపీచంద్ ఆక్సిజ‌న్‌కు మ‌రోసారి ఫైనాన్షియ‌ల్ ప్రాబ్ల‌మ్స్ త‌లెత్త‌డంతో ఈ సినిమా రిలీజ్ అయ్యేవ‌ర‌కు చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇక మిగిలిన సినిమాల్లో కార్తీ – ర‌కుల్‌ప్రీత్ జంట‌గా న‌టించిన ఖాకీ, సిద్ధార్థ్ గృహం సినిమాల‌పై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక శివ‌బాలాజీ స్నేహ‌మేరా జీవితం కూడా వ‌స్తోంది.మ‌రి ఈ సినిమాల్లో ఏవి హిట్‌, ఏవి ఫ‌ట్ అవుతాయో ?  చూడాలి.