వరుణ్ తేజ్ స్పేస్ మాయాజాలం అంత‌రిక్షం ప్రీమియ‌ర్ షో టాక్‌..

December 21, 2018 at 11:02 am

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ ‘అంతరిక్షం 9000 కేఎంపీహెచ్’. సంకల్ప్ రెడ్డి దర్శకుడు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. క్రిస్మస్ కానుక‌గా సిని ప్రేక్ష‌కుల ముందుకు శుక్రవారం విడుద‌లైంది. వాస్తవానికి ఇలాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్ అందరికీ నచ్చవు. కానీ, వరుణ్ తేజ్ హీరో కావడంతో సాధారణంగానే అందరి కళ్లు ఈ చిత్రంపై పడ్డాయి. దానికి తోడు ‘ఘాజీ’ లాంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ఈ చిత్రానికి పనిచేయడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండటం, అంతరిక్షాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంతో సినిమా అదిరిపోతుందని అంతా అనుకున్నారు. అయితే సైన్స్ ఫిక్ష‌న్ క‌థ‌తో తెరెకెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను కొంత నిరాశ ప‌రుస్తోంద‌నే చెప్పాలి.

ఫస్టాఫ్ సాదాసీదాగా కొన‌సాగుతుంది. పాత్రల పరిచయాలు, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ, అంతరిక్షంలోకి వెళ్లడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ అయిపోతుంది. మిగతా కథంతా సెకండాఫ్‌లోనే కొన‌సాగుతుంది. సెకండాఫ్‌లో కూడా సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. అంతరిక్షంలోకి వెళ్లిన తరవాత వచ్చే సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ వర్క్ పెల‌వంగా క‌న‌బ‌డుతుంది. నిర్మాణ విలువలు కూడా నామ‌మాత్రంగా ఉన్నాయి. ప్రేక్ష‌కుల అంచ‌నాలు ఏమాత్రం ఈ సినిమా అందుకోలేద‌నే చెప్పాలి. ఇలాంటి సినిమాలు ప్రేక్షకుడిని క‌థ‌తో ఆ లోకంలోకి తీసుకెళ్లిపోవాలి. అప్పుడే సినిమా స‌క్సెస్ కాగ‌ల‌దు.

కానీ ఈ మిషన్ ఆ విషయంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యార‌ని ప్రేక్ష‌కుల టాక్‌. సినిమా అంతా సీరియ‌స్ మోడ్‌లో నడ‌వ‌డం, ఇక అంత‌రిక్షం సీన్లపై అంచ‌నాలు పెట్టుకున్న ప్రేక్ష‌కుడికి ఏమాత్రం థ్రిల్ లేక‌పోవ‌డంతో సినిమా ఎప్పుడు అయిపోతుందా..? బ‌య‌ట ప‌డుదామా..? అన్న ఫీలింగ్‌ను తెప్పించాయి. ఇక వీఎఫ్ఎస్ వ‌ర్క్స్ వ్యాల్యూ ఎక్క‌డా చెప్పుకోద‌గిన స్థాయిలో లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు ఊసురుమ‌న్నారు. ఇక పతాక స‌న్నివేశాల్లో కూడా ద‌ర్శ‌కుడు తేలిపోయాడు.

వరుణ్ తేజ్ స్పేస్ మాయాజాలం అంత‌రిక్షం ప్రీమియ‌ర్ షో టాక్‌..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share