వెంకి సినిమాలో స్టార్ హీరో?!

August 17, 2018 at 10:59 am

ఈ మద్య మల్టీస్టారర్ సినిమాల జోరు బాగా పెరిగిపోయింది. గతంలో తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ ఆర్ ల తర్వాత కృష్ణ, శోభన్ బాబు ల మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వచ్చేవి. ఆ తర్వాత సోలో హీరోల సినిమాల జోరు పెరిగిపోయింది. కొంత కాలంగా మళ్లీ మల్టీస్టారర్ వస్తున్నాయి. గతంలో వెంకటేష్, మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మళ్లీ వెంకి, పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో గోపాల గోపాల..ఇలా తెలుగు లో మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగిపోతుంది. 3012_babubangaram

తాజాగా ‘నేను లోకల్’ చిత్ర దర్శకుడు త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ఓ సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో మరో అగ్ర హీరో కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఆ హీరో ఎవరో కాదు సూర్య. ఇప్పటికే సింగం సీరీస్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సూర్య ఈ సినిమా 20 నిమిషాల పాటు పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు..ఈ సినిమాలో ఇదే కీలకమైన సీన్ అని అంటున్నారు.Victory-Venkatesh-Stylish-Photos-from-Babu-Bangaram9

ఈ వార్తలు నిజమోకాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమా కు సంబంధించి పూర్తి డిటెల్స్ త్వరలో వెళ్లడించనున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో వెంకటేష్, మెగా అబ్బాయి వరుణ్ తేజ్ లు ‘ఎఫ్ 2’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు.suryia new-min

వెంకి సినిమాలో స్టార్ హీరో?!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share