‘ అదిరింది ‘ తో బాక్సాఫీస్ అదుర్స్‌

ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ సినిమా తెలుగులో అదిరింది పేరుతో ఈ వారం థియేటర్ల‌లోకి దిగింది. త‌మిళ‌నాడ దీపావ‌ళికి మెర్స‌ల్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో రెండు వారాలు ఆల‌స్యంగా ఎట్ట‌కేల‌కు అదిరింది పేరుతో థియేట‌ర్ల‌లోకి దిగింది. సినిమా రిలీజ్‌కు ముందే కావాల్సిన‌న్ని వివాదాలు చుట్టుముట్ట‌డంతో తెలుగులోను కావాల్సినంత హైప్ వ‌చ్చింది.

త‌మిళ‌నాడులో ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 240 కోట్ల వ‌సూళ్ల‌ను కొల్ల‌గొట్టి, కోలీవుడ్‌లో ఆల్ టైం ఆప్ – 3 సినిమాల జాబితాలో చేరిన ఈ సినిమా తెలుగులో అదిరింది పేరుతో గురువారం రిలీజ్ అయ్యింది. మాస్ ప్రేక్ష‌కులు మెచ్చే మాంచి క‌మ‌ర్షియ‌ల్ మెసేజ్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు ఇక్క‌డ తొలి రోజు నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. 

ఇక్క‌డ ట్రేడ్ వ‌ర్గాల‌కు షాక్ ఇస్తూ అదిరింది ఓ తెలుగు సినిమా రేంజ్‌లో వ‌సూళ్లు కొల్ల‌గొడుతోంది. తొలి రోజు 1.63 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా శుక్ర, శనివారాల్లో కూడా లాభదాయకమైన కలెక్షన్లను రాబట్టింది. ఆదివారం కూడా సినిమాకు అదిరిపోయే వ‌సూళ్లు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఫ‌స్ట్ వీకెండ్ ముగిసేస‌రికి ఈ సినిమాకు రూ.5 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌స్తుంద‌ని అంచ‌నా. తెలుగులో విజ‌య్ కెరీర్‌లోనే ఇది వ‌సూళ్ల ప‌రంగా బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌వ‌నుంది.