విజయ్ దేవరకొండ డబ్బు తీసుకున్నాడు కానీ …!

October 13, 2018 at 5:43 pm

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈ మద్య విజయ్ నటించిన ‘గీతాగోవిందం’ సినిమా తో సూపర్ హిట్ కొట్టేయమే కాదు..ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ఓ స్టార్ నిర్మాత వద్ద డబ్బులు తీసుకున్నాడట..అది ఇప్పుడు కాదు..తన కెరీర్ బిగినింగ్ లో..అయితే అతనికి ఓ సినిమా చేస్తానని మాటిచ్చాడట. ఈ నేపథ్యంలో విజయ్ ఆ నిర్మాత వద్దకు ఎన్నో కథలు పంపుతున్నాడట..కానీ ఇప్పటికీ ఓకే కాలేదు.

అప్పట్లో ‘పవర్’, ‘ఆటగదరా శివ’, రజనీకాంత్ హీరోగా ‘లింగ’ చిత్రాల నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్‌ ‘పెళ్లి చూపులు’ సినిమా కంటే ముందు ఓ పాత్ర కోసం విజయ్ దేవరకొండను సంప్రదించారట. కానీ ఆ నిర్మాతతో సినిమా తీయడం కుదరలేదట..కానీ, ఓ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరూ ట‌చ్‌లో వున్నారు. అంతే కాదు అప్పట్లో విజయ్ తన సొంతగా ఓ ఇల్లు కొంటున్న సమయంలో డబ్బు తక్కువ పడితే..రాక్‌లైన్ వెంక‌టేశ్‌కి కాల్ చేయ‌గా, ఆయన పెద్ద మొత్తంలో పంపించారు.

అంత సహాయం చేసిన ఆ నిర్మాతకు ఎలాగైనా మంచి సినిమా చేసిన పెట్టాలని విజయ్ దేవరకొండ నిశ్చయించుకొని తనకు నచ్చిన కథలను నిర్మాత దగ్గరకు పంపించడం ప్రారంభించాడు. కానీ ఆ కథలు మాత్రం ఆ నిర్మాతను ఇంప్రెస్ చేయలేక పోతున్నాయి. నిర్మాతకు కథ నచ్చిన వెంటనే సినిమా పట్టాలు ఎక్కుతుంది. తెలుగులో మాత్రమే ఆ సినిమా వుంటుందా? తెలుగు, తమిళ భాషల్లో తీస్తారా? విషయం తెలియాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ డబ్బు తీసుకున్నాడు కానీ …!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share