ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

November 19, 2018 at 12:23 pm

ప్రస్తుతం తెలుగు చిత్ర సీమాలో కొత్త హీరోల హవా నడుస్తుంది. నాని, శర్వానంద్, నిఖిల్ లాంటి హీరో వరుస విజయాలతో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే కేవలం మూడు సినిమాలతో స్టార్ రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఈ మూడు సినిమాలు హ్యాట్రిక్ విజయం అందుకున్నాయి. ఆ తర్వాత నోటా సినిమా బాగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ట్యాక్సీవాలా సినిమాతో మరో ఘన విజయం సాధించాడు. ‘ట్యాక్సీవాలా’ సినిమా మొదటి రోజే 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను దక్కించుకుంది. 4-1542191396

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు దక్కించుకుంది. ఆ మద్య ట్యాక్సీవాలా సినిమా ప్రమోషన్ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. తన నోటా సినిమా ఫెయిల్ కావడానికి కారణం.. ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్న కారణంగా ఆ సినిమాపై ఎక్కువ శ్రద్ద పెట్టలేక పోయాను. అందుకే నోటా ఫ్లాప్ అయ్యిందని చెప్పిన విజయ్ దేవరకొండ ఆ కారణం వల్లే ఇకపై ఒకే సారి ఒక్క సినిమాను మాత్రమే చేయాలని ఫిక్స్ అయినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ మద్య స్టార్ హీరోలు అయిన మహేష్ బాబు – చరణ్ – ఎన్టీఆర్ లు సంవత్సరంకు రెండు సినిమాలు చేయడానికి సిద్దంగా ఉంటున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఒక్క సినిమా చాలు అనడంతో అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రశ్నని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందిస్తున్నారు. మరీ సంవత్సరానికి ఒక్క సినిమా అంటే..అనుకున్నయని సినిమా ఇండస్ట్రీలో జరుగవు. అలాంటి సమయంలో ఇండస్ట్రీలో ఎక్కువ గ్యాప్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. విజయ్ దేవరకొండ వంటి క్రేజీ హీరో సంవత్సరంకు ఒక్క సినిమా చేస్తానంటూ ప్రకటించడం దర్శక, నిర్మాతలకు కూడా కాస్త నిరాశను కలిగిస్తోంది.

ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share