‘గీతగోవిందం’ సూపర్ సీన్స్ డిలీట్ చేసారే!

September 10, 2018 at 3:21 pm

టాలీవుడ్ లోకి చిన్న పాత్రతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఏకంగా తెలుగు రాష్ట్రాల్లోనే రికార్డుల మోత మోగించాడు. ఈ మద్య గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన ‘గీతాగోవిందం’ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ఓవర్సీస్ లో కూడా జోరు కొనసాగిస్తుంది. తాజాగా ఈ సినిమా నైజాం ఏరియా కలెక్షన్ల పరంగా దుమ్ముదులుపుతుంది.

ఈ మద్య విజయ్ దేవరకొండను ఆయన అభిమానులు కొందరు తెలంగాణ మెగాస్టార్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. కేవలం స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యం అయిన నైజాం 20 కోట్ల మార్క్ కొద్ది దూరంలోనే ఉన్నాడు విజయ్ దేవరకొండ. గీతా గోవిందం విడుదలై నాలుగు వారాలు అవుతున్నా కూడా ఇంకా జోరు కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా ఆదివారానికి నైజాం ఏరియాలో ఏకంగా 19 కోట్లకు చేరింది.

నైజాం ఏరియాలో 20 కోట్లు సాధించిన చిత్రాల సంఖ్య చాలా తక్కువ. వాస్తవానికి నైజాం ఏరియాలో ఈ మార్క్ సాధించే సినిమాలు కేవలం స్టార్ హీరోలకు మాత్రమే సొంతం అంటారు. మరో వారం రోజుల పాటు నైజాం ఏరియాలో గీత గోవిందం చిత్రం ట్రెండ్ కొనసాగిస్తే..20 కోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోతుందంటున్నారు. చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం 19.55 కోట్లను సాధించింది..ఈ సినిమా తర్వాత ఆ రేంజ్ లో నడిచిన సినిమాలు.. ఫిదా – గబ్బర్ సింగ్ – భరత్ అనే నేను – సరైనోడు చిత్రాలు కూడా 20 కోట్లకు కాస్త తక్కువ వసూళ్లను రాబట్టాయి. విజయ్ దేవరకొండ నైజాం సత్తా చాటాలంటే..మరో కోటి రూపాయలు వసూళ్లు చేయాల్సి ఉంటుంది..అయితే . ఈనెల 13న శైలజ రెడ్డి అల్లుడు చిత్రం విడుదల కాబోతుంది. ఆ లోపు గోవిందం ఆ మార్క్ ను చేరుకుంటుందో చూడాలి.


‘గీతగోవిందం’ సూపర్ సీన్స్ డిలీట్ చేసారే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share