విజయ్ దేవరకొండకు వర్జిన్ టెస్ట్ !

July 21, 2018 at 12:56 pm
vijay devarakonda-

ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కాదేదీ కాపికి అనర్హం అన్న చందంగా కొనసాగుతుంది.   చాలా వరకు సినిమాల్లో మ్యూజిక్, ఫైట్ సీన్లు, సాంగ్స్ ఇలా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు కాపీ చేస్తూ తమ సినిమాలో పెట్టుకోవడం అది కాస్త హైలెట్ కావడంతో ఒరిజినల్స్ లబో దిబో అనడం జరుగుతుంది.  అయితే కొన్ని సాంగ్స్, కథలు కూడా కాపి చేస్తున్నారని..తమ కథను తమ అనుమతి లేకుండా వాడుకున్నారని ఫిలిమ్ ఛాంబర్ లో పలు ఫిర్యాదులు వచ్చిన సంఘటనలు ఉన్నాయి.  తాజాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘గీతాగోవిందం’ సినిమాకు ఇదే చిక్కొచ్చి పడింది.Geetha-Govindam-Movie-Latest-HD-Poster-  

 

ప్రముఖ చిత్రకారుడు పికాసో ఓ కొటేషన్ చెప్పారు…’గుడ్ ఆర్టిస్ట్స్ కాపీ; గ్రేట్ ఆర్టిస్ట్స్ స్టీల్’.. తెలుగులోకి అనువాదం చేస్తే ‘మంచి కళాకారులు కాపీ కొడతారు.. అదే గొప్ప కళాకారులు దొంగతనం చేస్తారు.’  ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇదే  జరుగుతుందనని పలువురు అంటున్నారు.  అసలు మ్యాటర్ కి వస్తే.. నివాస్ చాలా రోజుల నుండి డైరెక్షన్ డిపార్టుమెంటులో పనిచేస్తున్నాడట.  అతడు అప్పుడెప్పుడో ‘వర్జిన్’ అనే పేరుతో ఒక కథ రాసి ఆ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడట.  ఆ ‘వర్జిన్’ కి హీరో గా కమెడియన్ జోగి నాయుడుని అనుకున్నాడట. Vijay-Devarakonda-Rashmika-Mandanna-Geetha-Govindam-First-Look-Poster-HD 

 

కానీ ఎందుకో ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదట.  అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘వర్జిన్’ అనే కాన్సెప్ట్ తో రావడం పై రగడ మొదలైంది. . నేను వర్జిన్ అంటూ ఉండే సరికి ఆ నివాస్ ఈ సినిమాపై కంప్లైంట్ చేయడం జరిగిందట.  ఈ ‘వర్జిన్’ టెస్టును విజయ్ దేవరకొండ అయన టీమ్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.  ఇలాంటి టెస్టులే అసలు సినిమాలో నిజంగా విషయం ఉందా.. ఒరిజినల్ స్టఫ్ఫేనా కాదా అనే సంగతి అందరికీ  తెలిసేలా చేస్తాయి.    ఇవన్నీ తెలియాలీ అంటే ఆగస్టు 15 వరకు వేచి చూడాల్సిందే. 

విజయ్ దేవరకొండకు వర్జిన్ టెస్ట్ !
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share