‘నోటా’ రిలీజ్ పై తర్జన..భర్జన!

September 21, 2018 at 1:27 pm

టాలీవుడ్ లో సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ మద్య పరుశరామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీతాగోవందం’ సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు. స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన విజయ్ దేవరకొండ తదుపరి సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఈ సినిమా విడుదల విషయంలో విజయ్ టీం కొంచెం తొందరపడుతోంది కూడా. ముందు క్రిస్మస్ కానుకగా రిలీజ్ అన్నట్లు వార్తలొచ్చాయి కానీ.. అక్టోబరు 5కే పోస్టుపోన్ చేశారు.

రిలీజ్ డేట్ వచ్చేసిందన్నట్లు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో అనుకున్న సమయానికి ఆ చిత్రం వస్తుందా రాదా అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. ఒకసారి 4నే పక్కా అంటారు. ఇంకోసారి 18కి వాయిదా అంటారు. అనుకున్న టైం కల్లా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యే అవకాశం లేదని సినిమా రిలీజ్ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. స్టూడియో గ్రీన్ నిర్మాణంలో కే.ఇ. జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్న ఈ నోటా సినిమాకు తెలుగులో కూడా క్రేజ్ ఏర్పడింది.

ఇదిలా ఉంటే..ఐతే ఈ సినిమాకి థియేటర్ల సమస్య ఎదురవుతుందని కంగారు పడుతున్నారట. దసరాకు రిలీజ్ కి సిద్దంగా ఉన్న ఎన్టీఆర్ అరవింత సమేత తో థియేటర్లు నిలుస్తాయా లేదా అన్న సందేహాలున్నాయి. అలాగని 18న రిలీజ్ చేద్దామంటే ఇక్కడ వేరే సినిమాలకు థియేటర్లు బుక్ అయ్యాయి.దీంతో ఎటూ పాలుపోని అయోమయంలో ఉన్నాడు జ్ఞానవేల్.

తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉంచాలని చూస్తున్న ఈ సినిమా రెండు చోట్లా పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. దీంతో రిలీజ్ డేట్ విషయంలో తర్జన భర్జన కొనసాగుతోంది. ఐతే 4న రిలీజ్ పక్కా అనుకుంటే మాత్రం వెంటనే రిలీజ్ డేట్ పోస్టర్లు వేసి మెల్లిగా ప్రమోషన్ తో వర్క్ ఔట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లే సమాచారం.

‘నోటా’ రిలీజ్ పై తర్జన..భర్జన!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share