ఈ ఓవరాక్షన్ తగ్గించుకో..విజయ్ దేవరకొండపై హీరోయిన్ సెటైర్

June 20, 2018 at 9:37 pm
devarakonda vijay- heroin

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా గీతా గోవిందం. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ కొత్త పంథాలో చేస్తున్నారు. 65వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ ను వెరైటీగా చేస్తున్నాడు.

 

అందులో భాగంగా రష్మిక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చిందంట కదా కంగ్రాట్స్ అని చెబుతుంది. దాని రిప్లైగా అవార్డుల్లో ఏముంది మేడం మీలాంటి వాళ్లు నన్ను ప్రేమించడం చాలు గీతా మేడం అంటూ ట్వీట్ చేశాడు. దాని సమాధానంగా ఇగో గోవిందం ఈ ఓవరాక్షన్ తగ్గించుకోమనేది. అసలు నీకు కాదు ప్రభాస్ కో, తారక్ కో ఇస్తే బాగుండేదని ట్వీట్ చేసింది. వీరి సంభాషణని చూస్తే గీతా గోవిందం సినిమాకు ప్రమోషన్స్ గా హీరో, హీరోయిన్ పాత్రల పేర్లు గీతా, గోవిందం అంటూ చాట్ చేశారు.

ఈ ఓవరాక్షన్ తగ్గించుకో..విజయ్ దేవరకొండపై హీరోయిన్ సెటైర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share