ఏడాది తిరిగేలోపే విజయ్ రేంజ్ ఇలా…

May 9, 2018 at 11:43 am
vijay-devarakonda

టాలీవుడ్‌లో ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ స్టార్ హీరో అయిపోయాడు. యేడాది క్రితం ఓ సారి వెన‌క్కి వెళ్లి చూస్తే విజ‌య్ పెళ్లిచూపులు సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా ఓవ‌ర్సీస్‌లో పెద్ద హీరోల సినిమాల‌ను త‌ల‌ద‌న్నేలా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమా నిజంగా ఓ సంచ‌ల‌నం. ఒక్క‌సారిగా టాలీవుడ్ జ‌నాల చూపు విజ‌య్ వైపు ప‌డేలా చేసింది. 

 

ఈ సినిమా త‌ర్వాత వ‌చ్చిన అర్జున్‌రెడ్డి సినిమా కూడా అంచ‌నాల‌కు మంచి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యి విజ‌య్ ఇమేజ్‌ను ఎక్క‌డికో తీసుకువెళ్లిపోయింది. ఈ రెండు సినిమాల త‌ర్వాత విజ‌య్‌తో సినిమాలు చేసేందుకు బ‌డా బ్యాన‌ర్లు క్యూ క‌ట్టాయి. ఏకంగా ఆరేడు క్రేజీ ప్రాజెక్టులు అత‌డి చేతిలో ఉన్నాయి. గీతా ఆర్ట్స్ – యూవీ వాళ్లు, మైత్రీ వాళ్లు ఇప్ప‌టికే అడ్వాన్స్‌లు ఇచ్చారు. ఇక వైజ‌యంతీ వాళ్లు రెండు సినిమాలు చేసేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్న‌ట్టు టాక్‌.

 

ఇక విజ‌య్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ స్టార్ హీరో బ‌ర్త్ డేకు ఎలాంటి హంగామా ఉంటుందో ఆ రేంజ్‌లో హంగామా న‌డుస్తోంది. పీఆర్వోలు.. సెలబ్రెటీలు శుభాకాంక్షలతో హోరెత్తించేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో విజ‌య్ అభిమానుల హంగామా మామాలుగా లేదు. గ‌తేడాది విజ‌య్ పుట్టిన రోజుకు అస‌లు ఎలాంటి హంగామా లేదు. ఇప్పుడు సీన్ పూర్తి రివర్స్‌గా ఉంది. ఇప్పుడు మ‌నోడు ఓ స్టార్ హీరో అయిపోయాడు. తెలుగులో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇంత తక్కువ సమయంలో.. అది కూడా ఒకే ఒక్క సినిమాతో ఇలాంటి ఇమేజ్ సంపాదించిన వాళ్లు అరుదనే చెప్పాలి.

Mythri-Movie-Makers-Birthday-Wishes-to-Vijay-Devarakonda-1525839161-1572 (1)

ఏడాది తిరిగేలోపే విజయ్ రేంజ్ ఇలా…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share