ఇప్పుడు నుండి విజయ్ దేవరకొండ ” హీరో” నే

March 13, 2019 at 2:56 pm

టాలీవుడ్ స్టార్‌ విజయ్‌ దేవరకొండ వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్నాడు. ఒక సినిమా షూటింగ్ న‌డుస్తుండ‌గానే మ‌రో సినిమాకు ఓకే చెబుతున్నాడు. అంతేగాకుండా.. తన‌కు ఉన్న ఇమేజ్‌ను మార్క‌టైజ్ చేసుకుంటున్నాడు. మార్కెట్‌ను మరింత విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో భాగంగానే తన తదుపరి చిత్రాలను బహుభాషా చిత్రాలుగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం.. విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే.. డియర్‌ కామ్రేడ్ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. క్రాంతి మాధ‌వ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా డియ‌ర్ కామ్రేడ్ సినిమా ఉంటుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఇందులో స్టూడెంట్ లీడ‌ర్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ క‌నిపించ‌నున్నారు. ఇక ఆయ‌న‌కు జోడిగా న‌టిస్తున్న ర‌ష్మిక మంద‌న్న స్పోర్ట్స్ ఉమెన్‌గా క‌నిపించ‌నుంది. ఇప్ప‌టికే ఈ జోడి గీత‌గోవిందంలో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

ఇదిలా ఉండ‌గానే.. విజ‌య్‌దేవ‌ర‌కొండ మరో సినిమాను ప్ర‌క‌టించాడు. దీనిని కూడా మల్టీ లాంగ్వేజ్‌ సినిమాగా తెరకెక్కించనున్నట్టుగా చెప్పేశాడు. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వ‌స్తున్న ఓ సినిమాను భారీ బడ్జెట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించ‌నున్నారు. ఇందులో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. తాజా అప్‌డేట్ ఏమిటంటే.. ఈ సినిమాకు హీరో అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానుంది.

ఇప్పుడు నుండి విజయ్ దేవరకొండ ” హీరో” నే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share