‘ సావిత్రి ‘ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ దొరికేశాడు

ఆంధ్రుల అభిమాన నటి తెలుగు సినిమా ఎంతో గర్వించదగ్గ మ‌హాన‌టి సావిత్రి జీవితం వెండితెరమీదకి తీసుకువస్తున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. మహానటి జీవితాన్ని ప్రజలకి చుపించాలనుకోవడం ఒక సాహసమే అయినా ఎంతో కాన్ఫిడెంట్ ఉన్నాడు అశ్విన్.

సావిత్రి పాత్రకి తగినట్టు ఉండేలా యంగ్ హీరోయిన్ “కీర్తి సురేష్” ని ఆల్రెడీ ఎంపిక చేసుకున్నాడు. జెమిని గణేషన్ పాత్రకి దుల్కర్ సల్మాన్ ను తీసుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అండ్ ఏఎన్నార్ పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేసుకుంటాడ‌నేది ఇండస్ట్రీలో ఉత్కంట రేకెత్తిస్తోంది. గతంలో ఈ పాత్ర‌ల కోసం జూనియ‌ర్ ఎన్టీఆర్‌, నాగ‌చైత‌న్య‌ను అడిగినా వారు సున్నితంగా తిర‌స్క‌రించార‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

రీసెంట్ గా వ‌రుస విజ‌యాల‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న పెళ్ళిచూపులు ఫేం హీరో విజయ్ దేవరకొండని ఎన్టీఆర్ పాత్రకి తీసుకున్నట్టు సమాచారం. విజయ్ దేవరకొండ పెళ్ళిచూపులతో తానేంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలిసేలా పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర‌లో న‌టించ‌డం విజ‌య్‌కు పెద్ద ఛాలెంజ్ అయినా నంద‌మూరి ఫ్యాన్స్ అభిమానం చూర‌గొంటాన‌న్న ధీమాతో ఉన్నాడు.

నిజానికి సావిత్రి జీవిత కథను ఒక బయోపిక్ అనేకంటే.. బయోస్కోప్ లో మనం చూసే అతిపెద్ద మల్టీస్టారర్. ఎంతో మంది మహా మహా నటులతో నటించన ఆ మహానటి సినిమా కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశాడో చూడాలి.