స‌ర్కార్ వ‌సూళ్ల వ‌ర్షం…రంగస్థలం రికార్డు బ్రేక్

November 16, 2018 at 5:49 pm

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డును త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ స‌ర్కార్ సిసిమాతో బ్రేక్ చేశాడు. 200 కోట్లను అధిగమించిన చిత్రంగా రంగస్థలం సినిమాకు రికార్డ్ ఉంది. ఇప్పుడు ఈ రికార్డును మురుగదాస్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా వచ్చిన ‘సర్కార్’ సినిమా అధిగమించింది. సర్కార్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచి నిర్మాత‌ల‌కు వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. గ‌త ఏడాది విజయ్ నటించిన మెర్సల్ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన విష‌యం తెలిసింది. ఈ కోవ‌లోనే ఇప్పుడు ‘సర్కార్’ కూడా అదే క్లబ్‌లో చేరడం విశేషం. చెర్రీ, సమంత జంటగా వచ్చిన ‘రంగస్థలం’ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.pic

ఈ సినిమా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమా రూ.215 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. సర్కార్ విడుద‌లైన నాటి నుంచి ఇప్పటికి రూ.217 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇది సౌత్ ఇండియాలోనే అత్యధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.మురుగుదాస్ గ‌త చిత్రాలు కూడా తెలుగు, తమిళ్ భాష‌ల‌తో పాటు హిందీలోను అద్భుత విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది విజ‌య్ న‌టించిన మెర్సెల్‌కు..ఇటీవ‌ల విడుద‌లైన స‌ర్కారును వివాదాలు వెంటాడినా..ప్రేక్ష‌కులు మాత్రం బ‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. సినిమా బాగుంటే వివాదాలు క‌లెక్ష‌న్లను ఆప‌లేవ‌ని స‌ర్కార్ సినిమా మ‌రోసారి నిరూపించింద‌ని, ఈ ప‌రిణామాలు సినిమా ఇండ‌స్ట్రీకి మంచి చేస్తుంద‌ని ప‌లువురు సినీ పెద్ద‌లు పేర్కొంటున్నార‌ట.Vijay_Sarkar

ఇదిలా ఉండ‌గా తెలుగులో హీరో మ‌హేశ్ బాబుతో నిర్మించిన స్పైడ‌ర్ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. అప్ప‌టి నుంచి కొంత బాధ‌లో ఉన్న మురుగుదాస్ వ‌రుస రెండు హిట్ల‌తో తానేంటో మ‌రోసారి నిరూపించుకున్నాడు. చూస్తుంటే స‌ర్కార్ సినిమా 280కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌కు పైగా సాధిస్తుంద‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

స‌ర్కార్ వ‌సూళ్ల వ‌ర్షం…రంగస్థలం రికార్డు బ్రేక్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share