రామ్ చరణ్ “వినయ విధేయ రామ ” ప్రిమియర్ షో టాక్

January 11, 2019 at 7:51 am

చిత్రం: విన‌య విధేయ రామ‌
న‌టీన‌టులు: రాంచ‌ర‌ణ్‌, కియారా అద్వాని, వివేక్ ఒబెరాయ్‌
ద‌ర్శ‌కుడు : బోయ‌పాటి శ్రీ‌ను
సంగీతం: దేవిశ్రీ‌ప్ర‌సాద్‌
నిర్మాత‌: డీవీవీ దాన‌య్య‌

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి, హీరో రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి సినిమా విన‌య విధేయ రామ‌. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన‌ప్ప‌టి నుంచే క్ర‌మంగా అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. రాంచ‌ర‌ణ్‌ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌తోనే.. ఇది విన‌య విధేయ రామ కాదు.. విధ్వంస‌మేన‌నే టాక్ వ‌చ్చింది. పేరుకు.. ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కు ఏమాత్ర‌మూ సంబంధం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డ్డాయి. రంగ‌స్థ‌లం లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత రాంచర‌ణ్ న‌టించిన మొద‌టి చిత్రం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక బోయపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో అంచ‌నాలు అంత‌కంత‌కూ పెరిగిపోయాయి. అయితే.. ఈ సినిమా శుక్ర‌వారం నాడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. యూస్‌లో ముందే విడుద‌ల అయిన ఈ సినిమా ప్రీమియ‌ర్ షో ఎలా ఉందో చూద్దాం..49259657_1678679348944156_1089562537898278912_n

బోయ‌పాటి అన‌గానే.. కండ‌లు తిరిగిన హీరో.. ర‌క్త‌పాతంతో కూడా యాక్ష‌న్ సీన్లు, కుటుంబ నేప‌థ్యంలో సాగే భావోద్వేగ స‌న్నివేశాలు గుర్తుకు వ‌స్తాయి. ఇదే ఫార్మెట్‌లో విన‌య విధేయ రామ సినిమాలోనూ బోయ‌పాటి దించేశాడు. త‌న‌దైన శైలి డైలాగ్స్‌, ఫైట్లు, కుటుంబ నేప‌థ్యంలో సాగే క‌థ‌తో విన‌య విధేయ రామ‌ను మ‌మ అనిపించాడు. ఇందులో బోయ‌పాటి చూపించిన కొత్త కోణ‌మేమీ లేద‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి.. ఈ సినిమా భారాన్ని మొత్తం కూడా రాంచ‌ర‌ణ్ మీద వేసుకున్నాడు. త‌న న‌ట‌న‌, డ్యాన్స్‌ల‌తోనే నెట్టుకొచ్చాడ‌ని ప్రేక్ష‌కుల చెబుతున్నారు. రాంచ‌ర‌ణ్‌కు జంట‌గా న‌టించిన హీరోయిన్‌ కియారా అద్వానిది పెద్ద‌గా ప్రాధాన్యం లేని పాత్ర‌నే కావ‌డం గ‌మ‌నార్హం.49132531_1679452115533546_3354158618231439360_n

ఈ సినిమాలో అడుగ‌డుగునా ఫైట్లు ఉన్నాయి. ఇవి క‌థ‌లో క‌లిసిపోక‌పోవ‌డంతో ప్రేక్ష‌కుల తీవ్ర నిరాశ‌కు గుర‌య్యార‌నే టాక్ వినిపిస్తోంది. ఇక దేవిశ్రీ‌ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా అంత‌లా వ‌ర్కౌట్ కాలేద‌ని చెప్పొచ్చు. మొద‌టి భాగంలో త‌స్సాదియ్యా పాట‌, రెండో భాగంలో రామా ల‌వ్ సీతా పాట‌లు మాత్ర‌మే ఆక‌ట్టుకునేలా ఉన్నాయ‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు. ఇక విల‌న్ గా క‌నిపించిన వివేక్ ఒబెరాయ్ త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడని చెప్పొచ్చు. సినిమా మొత్తంగా ఇంట‌ర్వెల్ సీన్ మాత్రం హైలెట్‌గా నిలుస్తుంది. చాలా కాలం త‌ర్వాత ఈ సినిమాలో క‌నిపించిన ఆర్య‌న్ రాజేశ్ ప‌ర‌వాలేద‌ని అనిపించాడు. మొత్తంగా విన‌య విధేయ రామ బోయ‌పాటి, రాంచ‌ర‌ణ్ కాంబో విఫ‌ల ప్ర‌యోగంగానే నిలుస్తుంద‌ని చెప్పొచ్చు.

రామ్ చరణ్ “వినయ విధేయ రామ ” ప్రిమియర్ షో టాక్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share