రాంచరణ్ బీభత్సం “వినయ విధేయ రామ ” టీజర్

November 9, 2018 at 10:12 am
888888888888

మూస‌లో మాస్ ఫార్మెట్‌.. ఇదీ మ‌న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను స్టైల్‌. ఆయ‌న సినిమాల్లో క‌థాక‌థ‌నాల‌కు పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌దు. మొత్తం హీరోయిజం చుట్టూనే సినిమా గింగిరాలు కొడుతుంది. చూసే ప్రేక్ష‌కులూ అదే మూడ్‌లోకి వెళ్తారు. ఆయ‌నది ఇదే మార్క్‌..! మొద‌ట హీరో సైలెంట్ గా ఉండ‌డం.. ఆత‌ర్వాత ఏదో ఒక ఘ‌ట‌న నేప‌థ్యంలో హీరోలోని వ‌యోలెంట్ బ‌య‌ట‌కు త‌న్నుకురావ‌డం.. ఎమోష‌న్‌, భీక‌ర ఫైట్లు.. ఖేల్‌ఖ‌తం..! సినిమా అయిపోతుంది..! ఈ ఫార్మెట్‌లోనే బోయ‌పాటి కొట్టుకొస్తున్నారు.

ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న రాంచరణ్ తాజాగా బోయపాటి దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతున్నా మొన్నటి వరకు ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. దాంతో నిరాశ లో ఉన్న మెగా ఫ్యాన్స్ కాస్త ఊరట ఇస్తూ..సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

Vinaya-Vidheya-Rama-Teaser

రామ్ చరణ్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా అభిమానుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. రెండు చేతులతో ఆయుధాలు పట్టుకొని పరుగెడుతోన్న స్టిల్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ పోస్టర్ కే చరణ్ అభిమానులు ట్విట్టర్ లో ప్రపంచ స్థాయిలో ట్రెండ్ సెట్ చేసి కొత్త రికార్డులు సృష్టించారు. ఇప్పుడు అందరి చూపు టీజర్ వైపు ఉంది.

ఫస్ట్ లుక్ తో అయితే ఆకట్టుకున్నాడు మరి టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. చాలా రోజులుగా చరణ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న ఫస్ట్ లుక్, టైటిల్ బయటకి రావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. రాంచరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ నటిస్తుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి బరిలో దింపుతామని చిత్ర యూనిట్ అంటుంది.

రాంచరణ్ బీభత్సం “వినయ విధేయ రామ ” టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share