రామ్ చరణ్ “విన‌య విధేయ రామ” రివ్యూ&రేటింగ్

January 11, 2019 at 2:48 pm

టైటిల్ : వినయ విధేయ రామ
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, స్నేహ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : బోయపాటి శ్రీను
నిర్మాత : డీవీవీ దానయ్య

కుటుంబ బంధాల‌ను క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్‌లో తెర‌కెక్కించ‌డంలో బోయ‌పాటికి మించిన డైరెక్ట‌ర్ తెలుగు ఇండ‌స్ట్రీలో లేడు అనే బ్రాండ్ సంపాదించుకున్నారాయ‌న‌. ఇక వ‌రుస‌గా ధ్రువ‌, రంగ‌స్థ‌లం లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ల‌తో ఉన్న రాంచ‌ర‌ణ్ హీరోగా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన విన‌య విధేయ రామపై మెగా అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. శుక్ర‌వారం ఈ సినిమాలో థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది.

రాంచ‌ర‌ణ్‌తో పాటు ఇత‌ర భారీ తార‌గ‌ణంతో తెర‌కెక్కిన ఈ సినిమాపై పెద్ద అంచ‌నాలున్న ఈ సినిమా ఎలా ఉంది.. ద‌ర్శ‌కుడు ఎలా తీశాడు.. రాంచ‌ర‌ణ్ న‌ట‌న‌..యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఎలా న‌టించాడు..వంటి త‌దిత‌ర అంశాల‌ను ఇప్పుడు స‌మీక్ష‌లో చుద్దాం..49132381_1805911382853740_9114899682856796160_n

కథేంటంటే…
కుటుంబ స‌భ్య‌లంటే రామ‌( రామ్‌చ‌ర‌ణ్‌)కు పంచ ప్రాణాలు. ఎవ్వ‌రికి ఏ ఆప‌ద క‌లిగిన వారిని ర‌క్షించేందుకు ముందుంటాడు. ఇక అన్న‌లంటే పంచ ప్ర‌ణాలు. తాను చ‌దువుకోకోపోయిన అన్న‌ల‌ను మాత్రం పెద్ద చ‌దువుల‌ను చ‌దివించే భారాన్ని త‌ల‌కెత్తుకుంటాడు. పెద్దవాడు భువన్‌ కుమార్‌(ప్రశాంత్) అంటే ఇంట్లో అందరికీ గౌరవం. భువన్‌ కుమార్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా వైజాగ్‌లో పనిచేస్తుండగా పందెం పరుశురాం (ముఖేష్‌ రుషి) అనే వ్యక్తితో గొడవ అవుతుంది. అన్నల జోలికి ఎవరు వచ్చిన సహించలేని రామ, పరుశురాంని అతడి అనుచరులను కొట్టి ఎలక్షన్లు సజావుగా జరిగేలా చూస్తాడు. మంచి ఆఫీస‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న భువ‌న్‌కుమార్‌ను బీహ‌ర్‌కు ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్‌గా ప్ర‌భుత్వం నియ‌మిస్తుంది. బీహార్‌లోని ఓ ప్రాంతాన్ని అనాధికారికంగా ప్ర‌భుత్వంతో ప‌నిలేకుండా సామ్రాజ్యాన్ని న‌డుపుతున్న వ్యక్తి రాజు భాయ్‌ మున్నా (వివేక్‌ ఒబెరాయ్‌)తో వివాదాలు ఏర్ప‌డుతాయి.. రాజు భాయ్‌ తన ప్రాంతంలో ఎలక్షన్‌లే లేకుండా తనకు నచ్చిన వారినే పదువుల్లో పెట్టుకుంటున్నాడని తెలిసి భువన్‌ కుమార్ చ‌ర్య‌లు తీసుకునేందుకు య‌త్నిస్తాడు. మ‌రి రాజు భాయ్ భువ‌న్‌ను ఏం చేశాడు..అన్న‌కు అపాయం త‌ల‌పెట్టిన రాజుభాయ్‌ను రామ ఏం చేశాడు.. అన్న‌దే మిగ‌తా క‌థ‌.

ఎవ‌రెలా న‌టించారంటే…

రామ పాత్ర‌కు రామ్‌ చరణ్ పూర్తి న్యాయం చేశాడు. అయితే చాలా స‌న్నివేశాల్లో చిరంజీవిని అనుకరించినట్టుగా అనిపించినా.. అది ఓవ‌ర్ కాకుండా కొద్దిగా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు క‌నిపించింది. ఇక రామ పాత్రలో చ‌ర‌ణ్‌ ఒదిగిపోయాడు. గ‌త చిత్రాల‌తో పోల్చుకున్న‌ప్పుడు రాంచ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం, ధ్రువ‌కు మ‌ల్లే మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించాడు. పాత్ర‌కు కావాల్సినంత న‌ట‌న‌ను స‌మ‌కూర్చాడు. న‌ట‌న‌లోనూ చాలా ప‌రిణితి క‌నిపించింది. ముఖ్యంగా యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో చరణ్‌ నటన ఆకట్టుకుంటుంది. ఇక‌ హీరోయిన్‌ కియారా అద్వానీ విష‌యానికి వ‌స్తే కేవ‌లం సినిమాలో ఓ హీరోయిన్ ఉండాలి కాబ‌ట్టి ఆమెను తీసుకున్న‌ట్లుగా అనిపించింది. పాత్ర‌కు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. పాటలు అవసరమైనప్పుడు వచ్చిపోవటం తప్ప పెద్దగా నటనకు ఆస్కారం లేదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ప్రశాంత్ ఉన్న కాస్తంత‌లో ఫ‌ర్వాలేద‌నిపించాడు. వదిన పాత్రలో స్నేహ హుందాగా కనిపించింది. సెంటిమెంట్‌, భావోద్వేగ స‌న్నివేశాల్లో ఆమె న‌ట‌న ఆక‌ట్టుకుంది. విలన్‌గా వివేక్‌ ఒబెరాయ్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో తిరుగులేద‌నింపించాడు. ఆర్యన్‌ రాజేష్‌, ముఖేష్‌ రుషి, హరీష్ ఉత్తమన్‌, రవి వర్మ, మధునందన్‌ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఎవరికీ రెండు మూడు డైలాగ్‌లకు మించి లేవు.49344278_1681273475351410_5587185821355606016_n

ఎలా ఉందంటే…

వినయ విధేయ రామపై నెల‌కొన్న‌ భారీ అంచనాలను అందుకోలేక‌పోయింది. బోయపాటి సినిమా అంటే భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌, హై ఎమోషన్స్‌ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అయితేఈ సినిమాలో మ‌రీ మితిమీరిపోయింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎక్క‌వైంది. బోయపాటి గత చిత్రాలతో పోలిస్తే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా పెద్దగా వర్క్‌ అవుట్ కాలేదు. భారీ తార‌గ‌ణం స్క్రీన్‌పై క‌న‌బ‌డుతున్నా ఎవ్వ‌రినీ పెద్ద‌గా ఉప‌యోగించుకోలేద‌న్న‌ది నిజం. వారిని నామ‌మాత్రంగా తెర‌మీద మాత్ర‌మే చూపారు. కేవ‌లం రామ్‌ చరణ్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో సినిమా చేసే ప్రయత్నం చేశారు. దీంతో కథా కథనాలు పూర్తిగా గాడి తప్పాయి. ఒక దశలో యాక్షన్‌ సీన్స్‌ మధ్యలో కథ వచ్చిపోతున్న భావన కలుగుతుంది. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ కూడా ఆకట్టుకోలేకపోయాడు. రిషీ పంజాబీ తన సినిమాటోగ్రఫితో సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. ఎలివేషన్‌ షాట్స్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఒక్క వాక్యంలో చెప్పాలంటే…
మితిమీరిన హింస‌..క‌థా క‌థ‌నంలో లోపాలే సినిమాను నిరాస‌క్తిగా మార్చాయి. ఎమోష‌న‌ల్ కూడా పండ‌లేదు. ప్రేక్ష‌కులు ఊసురుమంటూ థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చే ప‌రిస్థితి క‌ల్పించారు.

చివ‌రిగా.. విన‌య విధేయ రామ‌.. ఇదేమి క‌ర్మ‌

రేటింగ్ : 2.0/5

రామ్ చరణ్ “విన‌య విధేయ రామ” రివ్యూ&రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share