విశాల్ సంచలన వ్యాఖ్యలు ..శ్రీరెడ్డి విషయంలో నేను నానిని నమ్మను

June 13, 2018 at 4:49 pm

టాలీవుడ్ లో గత కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి ఎప్పుడైతే పవన్ కళ్యాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.  దాంతో అప్పటి వరకు ఆమెకు మద్దతుగా నిలిచిన శ్రీరెడ్డి కొత్త వీడియో.. పాపం నాని !చాలా మంది వెనక్కి వెళ్లారు.  అంతే కాదు ప్రతిరోజూ మీడియాలో తన ఇంటర్వ్యూలతో ఊదరగొట్టిన శ్రీరెడ్డిని మీడియా దూరంగా ఉంచింది.  దాంతో శ్రీరెడ్డి ఇంటికే పరిమితం కావడం…ఇంటి నుంచే సోషల్ మాద్యమంలో పలువురు సెలబ్రెటీలను టార్గెట్ చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 2 సీజన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నేచురల్ స్టార్ నాని ని టార్గెట్ చేసుకొని కొన్ని ఘాటైన్య వ్యాఖ్యలు రాస్తూ..ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.  

 

దాంతో నాని చాలా సీరియస్ గా స్పందించి..ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుందని..శ్రీరెడ్డికి లీగల్ నోటీస్ పంపారు.  దీనిపై స్పందించిన శ్రీరెడ్డి తాను కూడా లీగల్ గానే పోరాడుతా అంటూ కౌంటర్ ఇచ్చింది.  తాజాగా సోషల్ మీడియాలో నేచుర‌ల్ స్టార్ నాని, న‌టి శ్రీరెడ్డి మ‌ధ్య జ‌రుగుతున్న వివాదం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నానిపై సోష‌ల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం, నాని ఆమెకు లీగ‌ల్ నోటీసులు పంప‌డం వంటివి చ‌ర్చ‌నీయాంశాలు అవుతున్నాయి. 

 

తాజాగా ఈ వివాదంపై త‌మిళ హీరో విశాల్ స్పందించాడు. ఇండస్ట్రీలో నాని నాకు ఎప్పటి నుంచో తెలుసునని..అంత‌మాత్రాన నేను అత‌ణ్ని గుడ్డిగా స‌మ‌ర్థించ‌ను. తాజాగా నానిపై ఆమె (శ్రీరెడ్డి) చేసిన ఆరోప‌ణ‌లు అస‌మంజ‌సంగా ఉన్నాయి. నాని గురించి తెలిసిన వాళ్లంద‌రికీ సాటి మ‌నుషుల‌తో అత‌ని ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉంటుందో తెలుసు. నాని అలాంటి వ్యక్తి అయి ఉంటే..ఇండస్ట్రీలో ఇంత మంచి హిట్స్ కొట్టి ఉండే వాడు కాదని..ఏదో ప‌బ్లిసిటీ కోసం ఆరోప‌ణ‌లు చేయ‌డం కాకుండా.. ఆమె వ‌ద్ద ఏమైనా ఆధారాలు ఉంటే బ‌య‌ట‌పెట్టాలి. 

 

ఇదంతా చూస్తుంటే ఒక‌రి త‌ర్వాత ఒక‌రిని ఆమె వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్న‌ట్టుగా ఉంది. తర్వాత నా మీద కూడా ఆమె ఆరోప‌ణలు చేస్తుందేమో అని విశాల్ అన్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమే అని..దాన్ని అరికట్టడానికి సినీ పెద్దలు కృషి చేస్తున్నారని అన్నారు విశాల్.  ‘అభిమన్యుడు’ విజ‌యోత్స‌వ యాత్రలో భాగంగా విశాల్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. విశాల్-సమంత జంటగా నటించిన అభిమన్యుడు సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

విశాల్ సంచలన వ్యాఖ్యలు ..శ్రీరెడ్డి విషయంలో నేను నానిని నమ్మను
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share