‘ వివేకం ‘ ప్రీమియ‌ర్ షో టాక్‌… అంచ‌నాలు అందుకుందా

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ – శివ కాంబినేష‌న్ అంటే సౌత్ ఇండియ‌న్ సినిమా జ‌నాల్లో ఎక్క‌డా లేని క్రేజ్ వ‌చ్చేస్తుంది. గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన వీర‌మ్‌(తెలుగులో వీరుడొక్క‌డే), వేదాళం సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద వీరంగం ఆడేశాయి. శివ పేరు చెపితే మాస్ జ‌నాలు ఉర్రూత‌లూగిపోతారు. ఇప్పుడు వారి కాంబోలో తెర‌కెక్కిన భారీ బ‌డ్జెట్ సినిమా వివేగం(తెలుగులో వివేకం) భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది.

అజిత్ సినిమాల‌కు కోలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక తెలుగులో వ‌స్తోన్న వివేకం సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోను మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్‌, టీజ‌ర్ విజువ‌ల్స్ చూసిన జ‌నాలు వివేకం సినిమాను హాలీవుడ్ టేకింగ్ ఉన్న సినిమాగా పోలుస్తున్నారు. ఇప్ప‌టికే అమెరికాలో ప్రీమియ‌ర్ షో కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా క‌థాబ‌లం లేని రిచ్ విజువ‌ల్స్ సినిమాగా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

అజిత్ స్టైలీష్ యాక్ష‌న్ మోడ్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాడు. ఈ జాన‌ర్‌లో తెరకెక్కిన వివేకం సినిమాలోనే అదే రీతిలో మెప్పించాడు. మిల‌ట‌రీ ఆప‌రేష‌న్‌, టెర్ర‌రిజం బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కింది. బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా న‌టించాడు. విజువ‌ల్స్‌, టేకింగ్ ప‌రంగా హాలీవుడ్ రేంజ్‌లో ఉన్న వివేకం క‌థాప‌రంగా మాత్రం తేలిపోయింద‌న్న టాక్ వ‌స్తోంది.

ద‌ర్శ‌కుడు శివ సినిమాల్లో బ‌ల‌మైన క‌థ‌కు యాక్ష‌న్ ఎపిసోడ్లు వెన్నుద‌న్నుగా ఉంటాయి. కానీ వివేకం సినిమాలో క‌థ‌ను విడిచేసి విజువ‌ల్స్‌, అజిత్ స్టైలిష్ యాక్ష‌న్‌, యాక్ష‌న్ ఎపిసోడ్ల‌నే శివ న‌మ్ముకోవ‌డంతో సినిమా అంచ‌నాలు అందుకోలేద‌న్న టాక్ వ‌చ్చేసింది. ప్రేక్ష‌కులు ఆశించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను శివ ఇవ్వ‌లేక‌పోయాడు.

ఇక అజిత్ న‌ట‌న‌కు ఎప్పుడూ వంక పెట్ట‌లేం. ఈ సినిమాలోను అదే జ‌రిగింది. త‌న స్టైలీష్‌ నటనతో ఆకట్టుకున్నాడు. కానీ కథనంలో బలం లేకపోవడంతో సన్నివేశాలు అంతగా పండలేదు. విజువల్స్, స్టైలిష్ టేకింగ్‌లో మాత్రం హాలీవుడ్ రేంజ్‌లో ఉంద‌ని ప్రేక్ష‌కులు అంటున్నా, క‌థ‌లో ద‌మ్ములేక సినిమా ఎట్రాక్ట్ చేయ‌లేక‌పోయింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి TJ.COM