పాపం వివివినాయక్…పరిస్థితి ఎంత దయనీయం!

October 13, 2018 at 1:21 pm

పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మే పరిస్థితి వచ్చిందని అంటారు. నిజంగానే ఇండస్ట్రీలో కొంద మంది విషయాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు స్టార్ హీరోలుగా..విలన్లుగా..క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న వాళ్లు..ఒకదశలో ఆఫర్లు లేక అగమ్యగోచరంతో కష్టాలు పడుతున్న విషయంలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. తాజాగా ఇప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకరు వి.వి.వినాయక్ తో సినిమా అంటేనే బాబోయ్ అనేస్తున్నారు. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలు అందించిన ఈయనతో సినిమా చేయడానికి హీరోలు పోటీ పడేవాళ్లు. నిర్మాతలు క్యూ కట్టేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తల్లకిందులైపోయింది.

మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 మంచి హిట్ అందించిన వివివినాయక్ ‘ఇంటిలిజెంట్’ తర్వాత వినాయక్ పెద్ద కష్టమే ఎదుర్కొంటున్నాడు. ఇంత చెత్త సినిమా వివివినాయక్ ఎలా చేశాడని విమర్శలు వచ్చాయి. ఐతే ఇలాంటి పరిస్థితుల్లో కూడా వినాయక్ ను నమ్మి ‘ఇంటిలిజెంట్’ నిర్మాత సి.కళ్యాణ్ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. నందమూరి బాలకృష్ణతో సినిమా కమిట్ చేయించాడు. కానీ వినాయక్.. బాలయ్యను కథతో మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. Inttelligent---A-Sad-Story-For-Vinayak-And-Teju--1518508330-1026

ఈ సినిమా అయిన తర్వాత బోయపాటితో మరో సినిమా తీస్తున్నారని టాక్ వచ్చింది. మొత్తానికి బాలయ్య-వినాయక్ సినిమా ఉండదని దాదాపుగా తేలిపోయింది. మరోవైపు వినాయక్ కు ఇంకెవ్వరూ కూడా సినిమా ఇచ్చే పరిస్థితి లేదు. వినాయక్ వేరే హీరోల్ని కూడా ట్రై చేసి విఫలమయ్యాడట. నిర్మాత ఉన్నా.. హీరో దొరక్కపోవడం అంటే వినాయక్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నిర్మాత సి.కళ్యాణ్ విష్ చేస్తూ యాడ్ ఇచ్చాడు కానీ.. అందులో సినిమా ఏమీ ప్రకటించలేదు. మరి వివివినాయ్ సినిమా ఇప్పట్లో ఉంటుందా లేదా తెలియాల్సి ఉంది.

పాపం వివివినాయక్…పరిస్థితి ఎంత దయనీయం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share