పశ్చిమ గోదావరిలో కుల పెద్దల విచిత్ర తీర్పు

November 9, 2018 at 3:34 pm

ప్రపంచంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందంజల్లో ఉంటున్నారు. భారత దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలను దేవతలా కొలుస్తారని..వారి కట్టుబొట్టు సాంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శంగా ఉంటాయని అంటారు. కానీ ఈ మద్య మహిళల విషయంలో వివక్షత కొనసాగుతున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. యువతులు జీన్స్, మిడ్డీస్ వేసుకోవొద్దని..సెల్ ఫోన్లు వాడకూడదని కొన్ని చోట్ల తీర్పులు ఇచ్చే పంచాయితీల గురించి చదివే ఉంటాం. కొంత మంది రాజకీయ నాయకులు సైతం దేశంలో అత్యాచారాలు పెరిగిపోవడానికి గల కారణం అమ్మాయిల దుస్తులే కారణమనీ..అసభ్యంగా వస్త్రాదరణ చేసుకోవడం వల్లే యువకులు రెచ్చిపోయి అత్యాచారాలు, హత్యలకు పాల్పపడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.nightie_0

ఇదిలా ఉంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ వింతైన తీర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో మహిళలు ఉదయం పూట నైటీలు వేసుకొని రావొద్దని హుకుం జారీ చేశారు అక్కడ పంచాయితీ పెద్దలు. ఒకవేళ ఆ తీర్పును ఎవరైన మహిళలు ఉల్లంఘించి నైటీలు వేసుకొని బయటకు వస్తే..రూ. 2000 జరిమానా విధిస్తామని తీర్పు ఇచ్చారు. అంతే కాదు నైటీ వేసుకుని పగటిపూట తిరిగేవారిని చూపితే రూ.వెయ్య నజరానాగా ఇస్తామని ప్రకటించారు.

ఈ మేరకు ఊరంతా దండోరా వేయించారు. కాగా, కొంత కాలంగా మహిళలు నైటీలు వేసుకొని మార్కెట్లు, షాపులు, పాఠశాలలు, ఆసుపత్రులకు వచ్చేస్తున్నారని దాని వల్ల యువత చెడిపోతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి పంచాయతీ పెద్దల వాదన. ఈ తీర్పు గత 6 నెలలుగా అమలవుతోందని వెల్లడించారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో రావడంతో ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు తెలిపారు.

పశ్చిమ గోదావరిలో కుల పెద్దల విచిత్ర తీర్పు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share