అజ్ఞాత‌వాసికి ఎన్టీఆర్ ప్లాప్ సినిమాకు లింకేంటి..?

January 13, 2018 at 10:15 pm
ntr-pawan-TJ

స్కైను ట‌చ్ చేసే భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమా అంచ‌నాల‌ను అందుకోలేక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొక్క బోర్లా ప‌డింది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా తొలి రోజు రూ.40 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కేవ‌లం రూ.5 కోట్ల షేర్‌తో స‌రి పెట్టేసుకుంది. ఇక ఈ సినిమా ఫ్రెంచ్ సినిమా అయిన లార్గో విచ్‌కు మిక్కీకి మ‌క్కీ కాపీ అన్న విమ‌ర్శ‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు లార్గో విచ్ ఇండియ‌న్ రైట్స్ తీసుకున్న టీ సీరీస్‌తో సెటిల్ చేసుకుని రూ.10 కోట్లు చెల్లించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక అజ్ఞాత‌వాసి సినిమాను చూసిన లార్గో విచ్ డైరెక్ట‌ర్ జెరోమ్ సల్లే సైతం ఈ సినిమా త‌న సినిమాకు కాపీయే అని… ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింద‌ని, టీ సీరిస్ మాత్రం ఇండియ‌న్ రైట్స్ మాత్ర‌మే కొనుగోలు చేసింద‌ని.. దీనికి కూడా లెక్క తేల్చాల్సి ఉంద‌ని కూడా ఆయ‌న ట్వీట్ చేశాడు.

ఇదిలా ఉంటే అజ్ఞాత‌వాసి క‌థ‌పై టాలీవుడ్‌లో కొత్త టాక్ న‌డుస్తోంది. ఈ సినిమా కథకు మూలం ఏడేళ్ల క్రితం ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమా అని ఎన్టీఆర్ అభిమానులు కొంద‌రు చెపుతున్నారు. అజ్ఞాత‌వాసిలో తండ్రి సామ్రాజ్యం కాపాడేందుకు అజ్ఞాతంలో ఉన్న కొడుకు బ‌య‌ట‌కు వ‌స్తాడు. ద‌మ్ములో ఎక్క‌డో పెరిగే కొడుకు తండ్రి గౌర‌వం కాపాడేందుకు పెద్ద‌య్యాక వ‌స్తాడు. ఈ రెండు చోట్లా పెద్ద‌య్యాక గాని కొడుకుల వివ‌రాలు బ‌య‌ట‌కు రావు.

లార్గో విచ్ 2008లో వచ్చింది. దమ్ము ఆ తరవాత 2011లో వచ్చింది. అజ్ఞాత‌వాసి 2018లో వ‌చ్చింది. ఈ మూడు సినిమాలు ప్లాపులే. ఒక ప్లాప్ అయిన కాన్సెప్ట్‌ణు ఎన్ని సార్లు తీసినా ప్లాపే అన్న‌ది కూడా ఇక్క‌డ కొంద‌రు ప్ర‌స్తావిస్తున్నారు. అది అస‌లు సంగ‌తి.

అజ్ఞాత‌వాసికి ఎన్టీఆర్ ప్లాప్ సినిమాకు లింకేంటి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share