జై ల‌వ‌కుశ – స్పైడ‌ర్ – మ‌హానుభావుడు విన్న‌ర్ ఎవ‌రంటే

September 29, 2017 at 8:42 am
jsm-ph

టాలీవుడ్‌లో ద‌స‌రా కానుక‌గా మూడు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేశాయి. ఈ నెల 21న ఎన్టీఆర్ జై ల‌వకుశ‌, 27న మ‌హేష్ స్పైడ‌ర్ రిలీజ్ అయితే తాజాగా ఈ రోజు శ‌ర్వానంద్ మ‌హానుభావుడు కూడా రిలీజ్ అయ్యింది. ఈ మూడు సినిమాల్లో ఏది పైచేయి సాధించింది ? ఏ సినిమా లెక్క ఎలా ఉందో చూద్దాం. ద‌స‌రా సీజ‌న్‌లో వారం రోజులు ముందుగానే ఈ నెల 21న ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమాతో వ‌చ్చేశాడు. ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింద‌ని నిర్మాత క‌ళ్యాణ్‌రామ్ ప్ర‌క‌టించాడు. 

చిత్ర‌యూనిట్ జై ల‌వ‌కుశ సూప‌ర్ హిట్ అంటూ సంబ‌రాలు చేసుకుంటున్నా సినిమాకు అనుకున్న రేంజ్‌లో టాక్ అయితే రాలేదు. దీంతో వ‌సూళ్లు క్ర‌మ‌క్ర‌మంగా డ్రాప్ అయ్యాయి. ఈ సినిమాకు జ‌రిగిన బిజినెస్ ప‌రంగా చూస్తే ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం రూ.60 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది. మ‌రో రూ.30 కోట్ల‌కు పైగా షేర్ వ‌స్తేనే ఈ సినిమా బ‌య్య‌ర్లు సేఫ్ జోన్‌లోకి వ‌స్తారు. అంటే ఇంకా పెట్టిన పెట్టుబ‌డితో పోలిస్తే 40 శాతం రెవెన్యూ రివ‌క‌రీ అవ్వాలి. చాలా మంది ఇప్ప‌టికే సినిమా చూసేశారు. రిపీటెడ్ ఆడియెన్స్ లేరు. స్పైడ‌ర్‌, మ‌హానుభావుడు వ‌చ్చేశాయి. ఈ లెక్క‌న సినిమా ఎంత వ‌ర‌కు సేఫ్ జోన్‌లోకి వ‌స్తుందా ? అన్న‌ది చూడాలి.

ఇక స్పైడ‌ర్ తొలి రోజుకే ఎక్కువుగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రూ.156 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధిస్తే గాని గ‌ట్టెక్క‌దు. తొలి రోజు రూ.51 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయ‌ని చిత్ర‌యూనిట్ చెపుతున్నా రెండో రోజు నుంచే క‌లెక్ష‌న్లు బాగా డ్రాప్ అయ్యాయి. ఈ సినిమా త‌మిళ్‌లో ఏమో గాని తెలుగులో బ‌య్య‌ర్లును భారీగా ముంచ‌డం ఖాయ‌మని ట్రేడ్ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన ప్రాథ‌మిక స‌మాచారం ద్వారా తెలుస్తోంది. స్పైడర్ సినిమా చూసి బయటికొచ్చిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని మురుగదాస్ తెరకేక్కిన్చాడంటే నమ్మలేకపోతున్నామంటున్నారు.  

ఇక ఈ రోజు రిలీజ్ అయిన మ‌హానుభావుడు సినిమా లో బ‌డ్జెట్‌తో తెర‌కెక్కి త‌క్కువుగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక సినిమాకు ఇప్ప‌టికే హిట్ టాక్ వ‌చ్చేసింది. ఎప్పుడూ పండక్కి సైలెంట్‌గా హిట్లు మీద హిట్లు కొడుతోన్న శ‌ర్వా ఈ సారి కూడా ద‌స‌రా పండ‌క్కి రెండు పెద్ద సినిమాలు అయిన జై ల‌వ‌కుశ‌, స్పైడ‌ర్ సినిమాల మ‌ధ్య‌లో వ‌చ్చి హిట్ కొట్టేసిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఇక జై ల‌వ‌కుశ‌కు మిక్స్ డ్ టాక్‌తో పెద్ద‌గా లాభాలు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. స్పైడ‌ర్‌కు భారీ న‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఇక లో బ‌డ్జెట్‌తో త‌క్కువ బిజినెస్ చేసిన మ‌హానుభావుడు హిట్ టాక్‌తో లాభాలు సాధించే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌న‌ప‌డుతున్నాయి.

జై ల‌వ‌కుశ – స్పైడ‌ర్ – మ‌హానుభావుడు విన్న‌ర్ ఎవ‌రంటే
1 vote, 5.00 avg. rating (96% score)


Related Posts


Share
Share