యాత్ర వీకెండ్ క‌లెక్ష‌న్లు..

February 11, 2019 at 2:48 pm

వైఎస్సార్ జీవితం ఆధారంగా మ‌హి వీ రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన బ‌యోపిక్ యాత్ర సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది. విడుద‌ల అయిన మొద‌టి షో నుంచే జ‌నం నుంచి ఆదర‌ణ ల‌భిస్తోంది. ముఖ్యంగా ఇందులో వైఎస్సార్ పాత్ర పోషించిన మమ్ముట్టి న‌ట‌న‌కు అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక మొద‌టి రోజు తెలుగు రాష్ట్రాల‌తోపాటు ఓవ‌ర్సీస్‌లోనూ వ‌సూళ్లు బాగానే ఉన్నాయి.51054691_2288816778062529_755320116974977024_n

యాత్ర సినిమా వీకెండ్ క‌లెక్ష‌న్లు డిస్ట్రిబ్యూట‌ర్ల షేర్ రూ.5కోట్ల కంటే ఎక్కువ‌గా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొద‌టి రోజు డిస్ట్రిబ్యూట‌ర్ షేర్ రూ.1.93కోట్లు. రెండో రోజు 97ల‌క్ష‌లు, మూడో రోజు 1.06కోట్లు. ముఖ్యంగా సీడెడ్‌, గుంటూరు, నెల్లూరులో మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది. నిజాం, ఉత్త‌రాంధ్ర‌లో కూడా స‌త్తా చాటుతోంది.

వీకెండ్ క‌లెక్ష‌న్లు ఏరియాల వారీగా ఇలా ఉన్నాయి..

నిజాం………………… రూ.0.64కోట్లు
సీడెడ్‌………………….రూ.0.96కోట్లు
గుంటూరు……………రూ.0.82కోట్లు
ఈస్ట్‌……………………రూ.0.21కోట్లు
వెస్ట్‌……………………రూ.0.30కోట్లు
క‌`ష్ణా………………….రూ.0.41కోట్లు
నెల్లూరు……………..రూ.0.29కోట్లు
ఆంధ్ర‌………………….రూ.3.96కోట్లు
రెస్టాఫ్ ఇండియా……రూ.0.40కోట్లు
ఓవ‌ర్సీస్‌…………….రూ. 0.70కోట్లు

మొత్తం………………రూ.5.06కోట్లు

యాత్ర వీకెండ్ క‌లెక్ష‌న్లు..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share