‘ యుద్ధం శ‌ర‌ణం ‘  ప్రి రిలీజ్ బిజినెస్‌

‘మనం బతకాలంటే వాడికి ఎదురెళ్లాలి..ఇది ధైర్యం కాదు..తెగింపు’..అంటూ అక్కినేని నాగ చైతన్య గళం వినిపిస్తోన్న సినిమా యుద్ధం శరణం గచ్చామి . చైతు మాస్ పాత్రలో నటిస్తున్నాడు. చైతు ఇప్ప‌టికే ప్రేమమ్ – రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల‌తో హిట్ కొట్టి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. వారాహి బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో చైతు ప‌క్క‌న లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

కృష్ణ ఆర్.వి.మారి దర్శకత్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టి రేవతి కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్ ప్ర‌తినాయ‌క పాత్ర పోషించాడు. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుని ఈ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఓవ‌రాల్‌గా రూ. 20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

యుద్ధం శ‌ర‌ణం గ‌చ్చామి వ‌ర‌ల్డ్ వైడ్ ఏరియా ప్రి రిలీజ్ బిజినెస్ :

నైజాం – 6 (రూ. కోట్ల‌లో)

సీడెడ్ – 2.70

వైజాగ్ – 2

ఈస్ట్ – 1.30

వెస్ట్ – 1.10

కృష్ణా – 1.35

గుంటూరు – 1.60

నెల్లూరు – 0.75

కర్ణాట‌క – 1.20

రెస్టాఫ్ ఇండియా – 0.40

ఓవ‌ర్సీస్ – 1.60

—————————————————————

టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ = 20 కోట్లు

—————————————————————-