‘ యుద్ధం శ‌ర‌ణం ‘ ప్రీమియ‌ర్ షో రిపోర్ట్‌…. టాక్ ఎలా ఉందంటే

అక్కినేని నాగార్జున వార‌సుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి నాగ‌చైత‌న్య ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టూ ఎదుగుతున్నాడు. ప్రేమమ్‌, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి హిట్ల‌తో ట్రాక్ ఎక్కి హ్యాట్రిక్ హిట్ కోసం వెయిటింగ్‌లో ఉన్నాడు. వారాహి చల‌న‌చిత్రం బ్యాన‌ర్‌పై సాయి కొర్ర‌పాటి నిర్మాత‌గా కృష్ణ మ‌రిముత్తు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో చైతు స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టించింది.

రిలీజ్‌కు ముందే టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో ఆక‌ట్టుకున్న ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు కూడా కంప్లీట్ అయ్యాయి. ప్రీమియ‌ర్ షోల టాక్ ప్రకారం ఈ సినిమా చాలా సినిమాల్లో చూసిన స్టోరీయే. హీర – విల‌న్ మ‌ధ్య మైండ్ గేమ్ బేస్‌డ్ నేప‌థ్యంలో యుద్ధం శ‌ర‌ణం క‌థ ర‌న్ అవుతుంది. ఇక సినిమాకు స్క్రీన్ ప్లేనే హైలెట్‌.

హీరో – విల‌న్ మ‌ధ్య సాగే స‌న్నివేశాలు చాలా గ్రిప్పింగ్‌గా ఉన్నాయి. 141 నిమిషాల సినిమా క్రిస్పీగా ఉంది. సినిమా ఫ‌స్టాఫ్ కాస్త స్లోగా ఉన్నా ఇంట‌ర్వెల్ ట్విస్ట్ త‌ర్వాత సెకండాఫ్‌పై బాగా ఆస‌క్తి పెరుగుతుంది. అయితే ద‌ర్శ‌కుడు కృష్ణ సెకండాఫ్‌లోనే సినిమాను రేజ్ చేయ‌లేక అదే న‌త్త‌న‌డ‌క స్క్రీన్ ప్లేతో క‌థ న‌డిపించాడు.

ఇక హీరో చైతు – విల‌న్ శ్రీకాంత్ మ‌ధ్య వ‌చ్చే ఎత్తు పై ఎత్తు స‌న్నివేశాలు, స్క్రీన్ ప్లే, ట్విస్టులు, చైతు – లావ‌ణ్య కెమిస్ట్రీ సినిమాకు హైలెట్స్ అయితే స్లో న‌రేష‌న్‌, రొటీన్ స్టోరీ, కామెడీ లేక‌పోవ‌డం సినిమాకు మైన‌స్ పాయింట్లు. ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌తో ఉన్న చైతుకు ఈ యాక్ష‌న్ ఓరియంటెడ్ మూవీ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ ఇస్తుందో ? చూడాలి.

ఏ సెంట‌ర్ల‌లో ఈ సినిమా ఓకే అనిపించుకునేలా ఉన్నా మాస్‌ను మెప్పించే బీ, సీ సెంట‌ర్ల‌లో న‌డ‌వ‌డం క‌ష్ట‌మ‌ని తెలుస్తోంది. ఓవ‌రాల్‌గా సినిమాకు యావ‌రేజ్ అండ్ బిలో యావ‌రేజ్ టాక్ మాత్ర‌మే వ‌చ్చింది. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగు జ‌ర్న‌లిస్ట్‌.కామ్