యుద్ధం శ‌ర‌ణం TJ రివ్యూ

టైటిల్‌: యుద్ధం శ‌ర‌ణం

జాన‌ర్‌: ల‌వ్ & యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌

బ్యాన‌ర్‌: వారాహి చలనచిత్రం

నటీనటులు: నాగచైతన్య, లావణ్య త్రిపాఠీ, శ్రీకాంత్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు

మ్యూజిక్‌: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి

నిర్మాత: రజనీ కొర్రపాటి

దర్శకత్వం: కృష్ణ మరిముత్తు

సెన్సార్ రిపోర్ట్‌: యూ/ఏ

ప్రి రిలీజ్ బిజినెస్‌: 20 కోట్లు

రిలీజ్ డేట్‌: 8 సెప్టెంబ‌ర్‌, 2017

ప్రేమ‌మ్‌, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి రెండు వ‌రుస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్న అక్కినేని హీరో నాగ‌చైత‌న్య లేటెస్ట్ మూవీ యుద్ధం శ‌ర‌ణం. గ‌త రెండు సినిమాల్లో నటనలో ఒక మెట్టు పైకి ఎక్కిన నాగచైతన్య కృష్ణ ఆర్వీ మరిముత్తు దర్శకత్వంలో ఈ సినిమాలో న‌టించాడు. మంచి క‌థ‌ల‌తో సినిమాలు చేసే వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌లో సాయి కొర్ర‌పాటి ఈ సినిమాను నిర్మించారు. వారసుడు సినిమాలో నాగార్జునకు ప్రతినాయకుడిగా నటించిన శ్రీకాంత్, తిరిగి ఇంతకాలానికి అదే నాగ్ త‌న‌యుడి సినిమాలో విల‌న్‌గా న‌టించారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌లో చైతు-లావ‌ణ్య కెమిస్ట్రీ సూప‌ర్బ్ గా ఆక‌ట్టుకుంటోంది. మంచి అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

కథ:

రొటీన్ ఉద్యోగం ఇష్టంలేక‌ అర్జున్ (నాగ‌చైత‌న్య‌) డ్రోన్స్ రెడీ చేసే ప‌నిలో ఉంటాడు. అర్జున్ త‌ల్లిదండ్రులు అయిన ముర‌ళీ దంప‌తులు (రావు ర‌మేశ్‌, రేవ‌తి) డాక్ట‌ర్లు. సమాజ శ్రేయ‌స్సే త‌మ ల‌క్ష్యంగా ప‌నిచేస్తుంటారు. శ్రీమ‌తి ముర‌ళీ ద‌గ్గ‌ర ఇంట‌ర్న్ షిప్ చేయాల‌ని వ‌చ్చిన అంజ‌లి (లావ‌ణ్య త్రిపాఠి), అర్జున్‌తో ప్రేమ‌లో ప‌డుతుంది. ఈ టైంలో ముర‌ళీ దంప‌తులు యాక్సిడెంట్‌లో చ‌నిపోతారు. అయితే ఇది యాక్సిడెంట్ కాద‌న్న నిజం అర్జున్‌కు తెలుస్తుంది.

ఈ స్టోరీ ఇలా ఉంటే రాజ‌కీయ నాయ‌కుడు (వినోద్ కుమార్‌) నాయ‌క్ (శ్రీకాంత్‌)ను వాడుకుంటూ న‌గ‌రంలో బాంబులు పెట్టి అల్ల‌క‌ల్లోలం క్రియేట్ చేస్తుంటాడు. ఈ వ‌రుస బాంబ్ బ్లాస్ట్‌ల‌కు, ముర‌ళీ దంప‌తులు క‌న్నుమూయ‌డానికి, నాయ‌క్‌కు, రాజ‌కీయ‌నాయకుడికి ఎలాంటి లింకులు ఉన్నాయి ? అస‌లు ఈ సినిమా ఎలా మ‌లుపులు తిరిగి ? ఎలా ? ముగిసింది ? అన్న‌దే మిగిలిన స్టోరీ.

TJ న‌టీన‌టుల పెర్పామెన్స్ & విశ్లేష‌ణ‌:

కెరీర్ స్టార్టింగ్ నుంచి ల‌వ‌ర్‌బాయ్‌గా స‌క్సెస్ అవుతూ సీరియ‌స్ రోల్స్‌లో ఫెయిల్ అవుతోన్న నాగ‌చైత‌న్య యుద్ధం శరణం సినిమాతో మరోసారి అదే ప్రయత్నం చేశాడు. గత చిత్రాలతో పోలిస్తే నాగచైతన్య నటనలో మంచి పరిణతి కనిపించింది. ఎమోష‌న‌ల్ సీన్స్‌లో మెప్పించాడు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. కేవలం కథలో పాటలు రొమాన్స్ కోసమే ఆమె పాత్రను ఇరికినట్టుగా అనిపించింది.

సినిమాలో ద‌ర్శ‌కుడు కృష్ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఫ్యామిలీని అందంగా చూపించ‌డం వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. ఫ్యామిలీ ఎమోష‌న్స్ బాగా క‌నెక్ట్ అయ్యాయి. ఫ‌స్టాఫ్‌, ఇంట‌ర్వెల్ బ్యాంగ్ వ‌ర‌కు సోసోగా క‌థ‌నాన్ని న‌డిపించిన ద‌ర్శ‌కుడు సెకండాఫ్‌లో చేతులు ఎత్తేశాడు. ఎమోష‌న్స్ పండ‌లేదు స‌రిక‌దా..చాలా చోట్ల లాజిక్ ఉండ‌దు. మీసాలు కూడా స‌రిగా లేని కుర్రాడు మాఫియాను, రాజ‌కీయ నాయ‌కుల‌ను సైతం ఎదిరించేయ‌డం షాక్‌గా ఉంటుంది.

ఇక పాట‌లు అర్థ‌మైతే ఒట్టు. ఇక ప‌ర‌మ రొటీన్ స్టోరీ. ఏ మాత్రం కొత్త‌ద‌నం లేదు. అస‌లు నాగ‌చైత‌న్య ఈ స్టోరిని ఎలా ఒప్పుకున్నాడ్రా బాబూ అని జుట్టు పీక్కుంటాం. హీరో- విల‌న్ ఎత్తుకు పై ఎత్తుకు వేసుకునే సినిమా ఇది. ఇలాంటి స్టోరీలు ఎన్ని చూడ‌లేదు. ఇటీవ‌లే లై కూడా వ‌చ్చి వెళ్లింది. రాజ‌కీయ‌నాయ‌కుడిగా చేసిన వినోద్ కుమార్‌గానీ, ఇటు నాయ‌క్‌గా న‌టించిన శ్రీకాంత్ పాత్ర‌లు కానీ బ‌లంగా లేవు. క‌థా, క‌థ‌నం పేల‌వంగా ఉంది.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే….

సాంకేతికంగా నిఖేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్ర‌ఫీ, వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ మాత్రం ఓకే. ఎడిటింగ్‌ను ఎందుకు మెచ్చుకోవాలంటే ర‌న్ టైం త‌క్కువ కావ‌డంతో ప్రేక్ష‌కులు తొంద‌ర‌గా బ‌య‌ట ప‌డ్డారు. నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గిన‌ట్టుగా ఉన్నాయి. ఇక డైరెక్ట‌ర్ కృష్ణ ఆర్వీ మారిముత్తు తొలి సినిమాకే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స్టోరీ ఎంచుకోవ‌డం సాహ‌స‌మే అయినా పాత సినిమాల్లో క‌థ‌నే ఎత్తేసిన‌ట్టు ఉంది. ప‌ర‌మ రొటీన్ క‌థ‌, క‌థ‌నాల‌తో బండి లాగించేశాడు. ఫ‌స్టాఫ్‌ ఫ్యామిలీ, లవ్ సీన్స్ తో కాస్త నెమ్మదిగా నడిపించినా.. రెండో భాగంలో హీరో, విల‌న్ మ‌ధ్య మైండ్‌గేమ్‌తో సినిమా న‌డిపాడు. ఇక హీరో-హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ స్టోరీ ఫెయిల్ అయ్యింది.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– ఫ్యామిలీ ఎమోష‌న్స్‌

– హీరో – విల‌న్ మైండ్‌గేమ్‌లో కొన్ని సీన్లు

మైన‌స్ పాయింట్స్ (-):

– స్లో నెరేష‌న్‌

– రొటీన్ ల‌వ్ స్టోరీ

– హీరోయిన్‌

– ల‌వ్ స్టోరీ

TJ ఫైన‌ల్ పంచ్‌: ఇంత రొటీన్ యుద్ధ‌మా చైతూ

TJ ‘ యుద్ధం శ‌ర‌ణం ‘ మూవీ రేటింగ్‌: 2 / 5