ప్రదీప్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లో సందడి

July 19, 2018 at 3:58 pm

తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ సీజన్ 1 లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గత బిగ్ బాస్ సీజన్ లో శివబాలాజీ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో దీక్షాపంత్, నవదీప్ లు ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ 2 సీజన్ నడుస్తుంది. ఈ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. పదిహేడు మంది కంటెస్టంట్లో ముగ్గురు కామన్ మాన్ లు గా వచ్చారు అందులో సంజన, నూతన్ నాయుడు, గణేష్. అయితే బిగ్ బాస్ 2 లో ఇప్పటి వరకు సంజన, నూతన్ నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ.

ఇప్పటి వరకు బిబ్ బాస్ 2 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు ఇస్తున్నారన్న విషయం పై క్లారిటీ రాలేదు. కాకపోతే మొన్నటి వరకు హెబ్బా పటేల్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై స్పందించిన హెబ్బా తాను తన ఇంట్లోనే ఉన్నానని ఏ ఇంట్లోకి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ 2 సీజన్ లో మొదట కాస్త చప్పగా సాగినా మూడో వారం నుంచి రసవత్తరంగా సాగుతుంది. వెరైటీ టాస్క్ లతో ఇంటిసభ్యులు అలరిస్తున్నారు.

హోస్ట్ నాని ప్రతి శని – ఆదివారాలు సందడి చేసి హైప్ పెంచుతున్నాడు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ టీం తాజాగా అందరికీ షాకిచ్చింది. తెలుగు బుల్లి తెర హాట్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు బిగ్ బాస్ హౌస్ లోకి ఈ రాత్రి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు తాజాగా రిలీజ్ అయిన ప్రోమో వైరల్ గా మారింది. బుల్లి తెరపై యాంకర్ ప్రదీప్ సందర్భానుసారం కామెడీ పంచులు విసరడంలో దిట్ట. తెలుగు యాంకర్లలోకెల్ల అత్యంత చురుకైన వాడు.. ప్రదీప్ చేస్తున్న షోలన్నీ టాప్ రేటింగులతో దూసుకుపోతున్నాయి.

అయితే ఈ మద్య బిగ్ బాస్ ఇంటిలో మొన్నీ మధ్య బెడ్ మంచాలను మార్చారు. ఒకరి కోసం ప్రత్యేక బెడ్ వేశారు. దీంతో ఏదో వైల్డ్ కార్డు ఎంట్రీ వస్తుందని బిగ్ బాస్ ఇంటిసభ్యులంతా ఆసక్తిగా ఉన్నారు. తాజాగా ప్రదీప్ ఎంట్రీ ఇవ్వగానే వారంతా ఆశ్చర్యపోయారు. ప్రదీప్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే తన మార్కు కామెడీతో చెలరేగిపోయారు. వారు చేసిన మంచు పనులు చెప్పి కన్నీళ్లు పెట్టించాడు. కానీ చివర్లో మాత్రం ఓ ట్విస్ట్ ఇచ్చారు..తాను బిగ్ బాస్ ఇంటినుంచి పోకుండా ఉండాలంటే మీరంతా ఓ ప్రయత్నం చేయాలని చెప్పాడు. మరి ప్రదీప్ కంటిన్యూ చేస్తారా..లేదా గెస్ట్ అప్పీరియన్స్ మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది.

ప్రదీప్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్లో సందడి
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share