బిగ్ బాస్ 2 : హౌజ్ లో శివబాలాజీ ట్విస్ట్!

July 28, 2018 at 1:18 pm

గ‌త‌వారం ఎంతో సంద‌డిగా ఉన్న బిగ్ బాస్ హౌజ్ ఈ రెండు రోజుల నుండి వేడెక్కి పోయింది. మంచి చెడు టాస్క్ జ‌రిగిన స‌మయంలో హౌజ్‌లో ఎలాంటి వాతావ‌ర‌ణం నెల‌కొందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. భానుశ్రీ, తేజ‌స్వీ, కౌశ‌ల్‌, గీతా, సామ్రాట్ ఇలా ప‌లువురు మ‌ధ్య హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ జరిగాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ టాస్క్‌లో తేజూ, భానుల ప్ర‌వ‌ర్త‌న‌నే వారిని హౌజ్ నుండి బ‌య‌ట‌కు వెళ్ళేలా చేసింది. ఇక ఆ త‌ర్వాత వారం ల‌ఫ్పాంగిరిగిట్టా అనే సినిమా చిత్రీక‌ర‌ణ‌ కోసం అంద‌రు స‌మిష్టిగా ప‌ని చేయ‌డం, స‌ర‌దాగా ఉండ‌డంతో హౌజ్‌లో స‌హృద్భావ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

గడిచిన కొన్ని వారాలుగా లో స్లో రేటింగ్ తో నడుస్తున్న బిగ్ బాస్ కు ఈ వారం బాగా కలిసి వచ్చింది. రేటింగ్ బాగా పెరిగింది. పోయిన రెండు వారాల్లో చోటు చేసుకున్న సంఘటనలు – అతిథుల రాకతో షోపై జనాలకు ఆసక్తి కలిగింది. యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ ఇవ్వడంతో పాటు అందరినీ ఎమోషన్ కు గురిచేశాడు. ప్రదీప్ వచ్చాకే కొంచెం రేటింగ్ పెరిగిందని బిగ్ బాస్ టీం భావిస్తోంది. తాజాగా బిగ్ బాస్ హౌజ్ లోకి ‘బిగ్ బాస్ సీజన్ 1’ విజేత శివబాలాజీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

bigg-boss-telugu-759

బిగ్ బాస్ మొదలు పెట్టినప్పటి నుంచి హౌజ్ లో తనకంటూ ఓ ప్రత్యేక ఏర్పాటు చేసుకున్న శివబాలాజీ ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నవాళ్లకు ఎలా ట్రీట్ చేస్తారు..తన అనుభవాలు ఎలా పంచుకుంటారు అన్న విషయంపై ఆసక్తి పెరుతుగుతుంది. మొదటి సీజన్ లో శివబాలాజీలా నీట్ గా ఆడాలనే ఉద్దేశంతో అతడిని బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ గా పంపబోతున్నారని వార్తలు లీక్ అయ్యాయి. అందుకే ఈ వారంలో శివబాలాజీని ఎంట్రీ చేయాలని చూస్తున్నారు. మరి ఈ వార్త నిజమైతే మాత్రం బిగ్ బాస్ ఇంటిసభ్యులకు మరో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

బిగ్ బాస్ 2 : హౌజ్ లో శివబాలాజీ ట్విస్ట్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share