వీర రాఘవుడుకు లైన్ క్లియర్ ..ఇక ఎదురులేదు అంతే

October 8, 2018 at 1:48 pm

భారీ అంచనాల నడుమ రూపొందిన ఎన్టీఆర్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత’ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 11న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రం ఎన్టీఆర్‌ గత చిత్రాలతో పోల్చితే భారీ ప్రి రిలీజ్‌ బిజినెస్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. దాదాపు అన్ని ఏరియాల్లో కూడా రికార్డు స్థాయి ధర పలికినట్లుగా సమాచారం. ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ కాంబో కోసం ప్రేక్షకులు భారీ ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ కారణంగా ఈచిత్రంకు భారీ ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

60 కోట్లు బడ్జెట్ తో రూపొందించబడిన ఈ చిత్రం దాదాపు 93 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసినట్లుగా ట్రేడ్‌ వారాగాలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ నటించిన ”నోటా ” సినిమా పోటీ అవుతుందేమో అని అంతా భావించారు. ‘నోటా’ సక్సెస్ టాక్ దక్కించుకుంటే ఖచ్చితంగా అరవింద సమేత కలెక్షన్స్ తగ్గుతాయని ట్రేడ్ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని ‘నోటా’ ఫలితం తారు మారు అయ్యింది. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలో సినిమా విఫలం అయ్యింది.

ఈ కారణంగా అరవింద సమేత చిత్రానికి ఉన్న ఏకైక అడ్డంకి కూడా పూర్తిగా తొలిగిపోయినట్టు అయ్యింది. దీంతో ఈ చిత్ర యూనిట్ తోపాటు యంగ్ టైగర్ అభిమానుల్లో కూడా జోష్ కనిపిస్తోంది. ఇక దసరా సెలవులు కూడా ఈ సినిమాకు కలిసొచ్చే మరో అంశంగా కనిపిస్తోంది. అసలు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ సాంగ్స్ జనాల్లోకి వెళ్ళిపోయి ఈ సినిమా అంచనాలు మరింత పెంచుతున్నాయి.

వీర రాఘవుడుకు లైన్ క్లియర్ ..ఇక ఎదురులేదు అంతే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share