‘ఆర్ ఎక్స్ 100’లో అవి డిలీట్ చేశారే

July 19, 2018 at 5:04 pm
RX 100

‘ఆర్ ఎక్స్ 100’ .. దర్శకుడు .. హీరో హీరోయిన్లు కొత్తవాళ్లు కావడంతో, విడుదలకి ముందు ఎలాంటి అంచనాలు వేసుకోలేదు. అంతే కాదు ఈ సినిమా విడుదలైన సమయంలోనే విజేత, చినబాబు లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. చాలా చిన్న సినిమాగానే థియేటర్లకు వచ్చిన ‘ఆర్ ఎక్స్ 100’ భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఎవరనైతే టార్గెట్ చేసి సినిమా తీశారో వారి నుంచే లేటెస్ట్ బోల్డ్ మూవీ ఆర్ ఎక్స్ 100 కి కలెక్షన్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి.

సినిమాను తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించడంతో తొలిరోజు వసూళ్లతోనే సగానికి పైగా పెట్టుబడిని తిరిగి రాబట్టుకుంది ఈ సినిమా యూనిట్. గత గురువారం విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’ తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే రూ.7 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసి సంచలనం రేపింది. బయ్యర్ల పెట్టుబడి మీద ఇప్పటికే మూడు రెట్ల దాకా షేర్ వచ్చింది. ఈ తరం కుర్రకారు కోరుకునే అంశాలతో అల్లిన కథ కావడంతో, వాళ్లకు ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది.

యూత్ కావ‌ల‌సిన అన్ని మ‌సాలాలు వేసి ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి తీసిన ఆర్ ఎక్స్ 100 మూవీ క‌లెక్ష‌న్స్ లో దూసుకుపోతున్న‌ది. హీరో హీరోయిన్స్ ఇద్ద‌రూ కొత్త‌వారైనా ఓపెనింగ్స్ అదిరేలా వ‌చ్చాయి.. బోల్డ్ కంటెంట్ ఉన్న ఈ మూవీని చూసేందుకు యూత్ ధియేట‌ర్ల వ‌ద్ద క్యూక‌డుతున్నారు. థియాట్రికల్ రన్ లో 15 కోట్లకు మించి వసూలు చేయవచ్చని ట్రేడ్ విశ్లేషకుల అంచనా.

తాజాగా ఇప్పుడు ఈ సినిమాలోని డిలిట్ సీన్లు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఆ మద్య నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ సినిమాలో చాలా వరకు డిలిట్ సీన్లు యూట్యూబ్ లో రిలీజ్ చేస్తూ సినిమా పై మరింత ఆసక్తి పెంచారు. తాజాగా ఆర్ ఎక్స్ 100 సినిమా విషయంలో కూడా ఒక్కో డిటిల్ సీన్లు యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు.

‘ఆర్ ఎక్స్ 100’లో అవి డిలీట్ చేశారే
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share