రాజమౌళి విషెష్ కి …శంకర్ అదిరిపోయే సమాధానం

November 3, 2018 at 3:30 pm

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘2.0’ సినిమాకి సంబంధించి ఈ రోజు ట్రైలర్ విడుదల అయ్యింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చెన్నైలోని సత్యం సినిమాస్ లోఅట్టహాసంగా నిర్వహిస్తున్నారు.rajamouli-and-shankar_b_0310181217

హాలీవుడ్ సినిమా స్థాయిలో తీసిన ఈ రోబో సీక్వెల్ కోసం అభిమానాలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత 3 .0 కూడా తీసే ప్లాన్ లో ఉన్నాడు శంకర్.
ఇక విషయానికి వస్తే… ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి వీడియో సందేశం ద్వారా శంకర్ గారు మిమ్మల్ని నేను గౌరవిస్తాను.. ఇన్ని కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్నప్పుడు మీపై ఎంతో ఒత్తిడి ఉంటుంది దాన్ని ఎలా భరిస్తున్నారని ప్రశ్నించారు.

దీనికి సమాధానం ఇచ్చే క్రమంలో శంకర్.. రాజమౌళిని పొగుడుతూ ప్రశంసలు కురిపించారు. ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన మీకు నేను అభిమానిని అంటూ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తాడు. ఒత్తిడిని అధిగమించడానికి పని చేస్తూనే ఉంటానని వెల్లడించారు. 2.0’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రాజమౌళి స్క్రీన్‌పై కనిపించి విషెస్ చెప్పారు.

‘2.0’ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక చెన్నైలోని సత్యం సినిమాస్‌లో వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ మాట్లాడుతూ దర్శకధీరుడు రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. ‘2.0’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రాజమౌళి స్క్రీన్‌పై కనిపించి విషెస్ చెప్పారు.

రాజమౌళి విషెష్ కి …శంకర్ అదిరిపోయే సమాధానం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share