టీఆరెస్ ఎమ్మెల్యేల టెన్షన్ మొత్తం దాని గురించేనట

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాలు, రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌వు. ఆయ‌న నిర్ణ‌యాలు ప్ర‌తిప‌క్ష పార్టీల‌కే కాదు సొంత పార్టీ వాళ్ల‌కే తెలియ‌వు. అది కేసీఆర్ స్టైల్‌. తాజాగా కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న ఏం చేస్తారో ? ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌క‌పోవ‌డంతో మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్న నేత‌ల్లో ఓ రేంజ్‌లో బీపీ పెరిగిపోతోంది. తెలంగాణ‌లో కేసీఆర్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు దాటిపోయింది. మ‌రో 21 నెల‌ల్లో 2019 సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ క్ర‌మంలోనే కేసీఆర్ ఇప్పుడున్న కేబినెట్‌తో మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళ్ల‌ర‌ని ఓ వార్త వ‌స్తోంది. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా కేబినెట్ ప్ర‌క్షాళ‌న ఎప్పుడు జ‌రుగుతుంది ? ప్ర‌స్తుతం ఉన్న కేబినెట్‌లో అవుట్ ఎవ‌రు ? ఇన్ ఎవ‌రు ? అన్న‌ది ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌క‌పోవ‌డంతో ప్ర‌స్తుం కేసీఆర్ కేబినెట్‌లో ఉండి వేటు క‌త్తి వేలాడుతోన్న ఎమ్మెల్యేల‌తో పాటు కొత్త‌గా బెర్త్ ఆశిస్తోన్న ఎమ్మెల్యేల్లో తెగ బీపీ పెరిగిపోతోంద‌ట‌.

కేసీఆర్ సీఎం అయిన ఈ మూడేళ్ల‌లో ఒక్క మార్పే జ‌రిగింది. ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న రాజ‌య్య‌ను తొల‌గించి క‌డియం శ్రీహ‌రికి ఛాన్స్ ఇచ్చారు. ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఇద్ద‌రూ కేసీఆర్ కేబినెట్‌లో బెర్త్ ఆశించారు. అయితే వీరిద్ద‌రికి స్థానం ద‌క్క‌లేదు. వీరు మంత్రి ప‌ద‌వి ఎప్పుడు వ‌స్తుందా ? అని కోటి ఆశ‌ల‌తో వెయిట్ చేస్తున్నారు.

ఇక సీనియ‌ర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ స్పీకర్ పదవి వద్దు మంత్రివర్గం చేరుతాను అని ఆసక్తి చూపించారు. తరువాత అవకాశం ఉంటుందని హామీ ఇచ్చినా చీఫ్విప్ పదవితోనే సరిపెట్టుకున్నారు. మాన‌కొండూరు ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌కు సైతం కేసీఆర్ మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పినా అది నెర‌వేర‌లేదు.

ఇక మ‌హిళా కోటాలో కొండా సురేఖ వేయిక‌ళ్ల‌తో వెయిట్ చేస్తున్నారు. తీరా చూస్తే ఎన్నిక‌ల‌కు మ‌రో యేడాదిన్న‌ర మాత్ర‌మే టైం ఉంది. మ‌రి ఇప్ప‌టికి అయినా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే బెర్త్ త‌క్కుతుంద‌ని ఆశ‌తో ఉన్న‌వారు త‌మ కోరిక ఎప్పుడు నెర‌వేరుతుందా ? అని తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నారు. మ‌రో వైపు కేసీఆర్ వీరికి తెగ బీపీ పెంచేస్తున్నారు.