హోటల్ గదిలో శవమై తేలిన హీరోయిన్

September 6, 2018 at 6:36 pm

అనుమానాస్ప‌దంగా తార‌లు మ‌`తి చెంద‌డం ఆగ‌డం లేదు.. ఎక్క‌డో ఒక చోట.. బుల్లితెర‌, వెండితెర న‌టీమ‌ణులు మ‌`తి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతూనే ఉంది. మొన్న‌టికి మొన్న ప్ర‌ముఖ హీరోయిన్ శ్రీ‌దేవి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో మ‌`తి చెంద‌డం తెలిసిందే. ఆమె మ‌`తి అభిమాన‌లోకం జీర్ణించుకోలేక పోతోంది. ఈ ఘ‌ట‌న‌లు టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనే కాదు.. ఇత‌ర ప్రాంతాల్లోని సినీరంగాల్లోనూ జ‌రుగుతున్నాయి. ఇలా ఎంద‌రో సినీతార‌లు ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టికీ కొంద‌రి మ‌`తికి కార‌ణాలు తెలియ‌లేదు. పోలీసులు కూడా తాజాగా.. ఇప్పుడిప్పుడే బుల్లితెర నుంచి వెండితెర‌పై త‌న అద‌`ష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న ఓ న‌టి ఓట‌ల్ గ‌దిలో మ‌`తి చెందింది. గ‌దిలో ఆమె మ‌`త‌దేహం ఉండ‌డం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది.

Payal-Chakravarthi6

పశ్చిమబంగలోని సిలిగురిలోని ఓ హోటల్‌ గదిలో సినీనటి పాయల్‌ చక్రవర్తి మృతదేహం లభ్యమైంది. మంగళవారం ఆమె హోటల్‌లో అద్దెకు దిగిందని, బుధవారం సాయంత్రం మృతిచెందిందని పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. బుధవారం ఆమె గ్యాంగ్‌టక్‌ బయలుదేరి వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన చోటుచేసుక‌న్న‌ట్లు తెలుస్తోంది. ఆమె ఉంటున్న గది తలుపును పలుమార్లు హోటల్‌ సిబ్బంది కొట్టినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో అనుమానంతో వాటిని పగలగొట్టారు. అప్పటికే ఆమె విగతజీవిగా పడి ఉండటంతో హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమచారర‌మిచ్చారు. కాగా, పాయల్‌ చక్రవర్తి బెంగాల్‌లో ప్రసారమైన పలు టీవీ సీరియళ్లలోనటించారు. ఇటీవలే ఆమె కొన్ని సినిమాల్లోనూ నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఆమె మృతి విషయం తెలుసుకున్న సహనటులు షాక్‌కు గుర‌య్యారు. మృతురాలికి ఓ కుమారుడుండగా, ఇటీవలే ఆమె భర్తతో విడాకులు తీసుకున్న‌ట్లు తెలిసింది. ఈ ఘ‌ట‌న‌తో మ‌రోసారి సినీతార‌ల అనుమానాస్ప‌ద మ‌`తి చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

హోటల్ గదిలో శవమై తేలిన హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share