వైశాఖం TJ రివ్యూ

సినిమా :  వైశాఖం

బ్యాన‌ర్: ఆర్‌.జె.సినిమాస్‌

ఆర్టిస్ట్స్: హ‌రీష్‌, అవంతిక‌, పృథ్వి, కాశీ విశ్వ‌నాథ్‌, ర‌మాప్ర‌భ‌, గుండు సుద‌ర్శ‌న్‌, సాయికుమార్‌, ఈశ్వ‌రీరావు త‌దిత‌రులు

లైన్ ప్రొడ్యూస‌ర్‌: బి.శివ‌కుమార్‌

మ్యూజిక్‌: డి.జె.వ‌సంత్‌

సినిమాటోగ్ర‌ఫీ: వాలిశెట్టి వెంక‌ట సుబ్బారావు

నిర్మాత‌: బి.ఎ.రాజు

ద‌ర్శ‌క‌త్వం: జ‌య‌.బి.

రిలీజ్ డేట్‌: 21 జూలై, 2017

చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ వంటి విభిన్నమైన చిత్రాల్ని రూపొందించి మహిళా దర్శకురాలుగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. తాజాగా హరీష్‌, అవంతిక జంటగా ఆర్‌.జె.సినిమాస్‌ బేనర్‌పై బి.ఎ.రాజు నిర్మాతగా జయ బి. రూపొందించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వైశాఖం’. ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ చిత్ర ప్రేక్షకుల్ని ఏమేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం.

క‌థ‌:

వైశాఖం క‌థ అపార్ట్‌మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ల‌వ్‌+ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో న‌డుస్తుంది. వేణు (హ‌రీష్‌) అల్ల‌రి చిల్ల‌రిగా తిరుగుతుంటాడు. అపార్ట్ మెంట్ వాసుల‌కు అత‌డి వ‌ల్ల చాలా డిస్ట‌ర్బ్‌గా ఉండ‌డంతో అత‌డు అపార్ట్‌మెంట్‌ను ఎప్పుడు ఖాళీ చేస్తాడా ? అని వెయిట్ చేస్తుంటారు. అదే అపార్ట్ మెంట్‌లోకి భాను (అవంతిక‌) వ‌స్తుంది. బ్యూటీపార్ల‌ర్ న‌డిపే భాను ఇల్లు అద్దెకు తీసుకునేందుకు వేణుకు గ‌ర్ల్‌ఫ్రెండ్‌గా అంద‌రికి ప‌రిచ‌యం చేసుకుంటుంది. ఆ విష‌యం తెలుసుకున్న వేణు నిజంగానే భానుకి మ‌న‌సిస్తాడు. కానీ భాను మాత్రం అత‌డి ప్రేమ‌ను రిజెక్ట్ చేస్తుంది. ఆ త‌ర్వాత ఏమైంది? అస‌లు భానుకి వేణు అంటే ఇష్ట‌మేనా ? కాదా ? ఫైన‌ల్‌గా ఈ అపార్ట్‌మెంట్‌లో వ్య‌క్తుల‌కు, భాను, వేణుకు మ‌ధ్య ఏం జ‌రిగింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ‌:

గ‌తంలో ద‌ర్శ‌కురాలిగా ప‌లు చిత్రాల‌తో త‌న టాలెంట్‌ను ఫ్రూవ్ చేసుకున్న జ‌య వైశాఖం కోసం అపార్ట్‌మెంట్ నేప‌థ్యాన్ని ఎంచుకున్నారు. అపార్ట్‌మెంట్లు అంటే మినీ ఇండియా, అవి ఉమ్మ‌డి కుటుంబం క‌న్నా గొప్ప, అయితే కొంద‌రి వ‌ల్ల ఈ సంస్కృతికి మ‌చ్చ మిగ‌ల‌క త‌ప్ప‌డం లేద‌ని సినిమాలో చూపించారు. హ‌రీష్ కొత్త‌వాడైనా చ‌క్క‌గా న‌టించాడు. హీరోయిన్ అవంతిక అటు మోడ్ర‌న్ డ్రస్సుల్లోనూ, ఇటు గ్లామ‌ర్ డ్ర‌స్సుల్లోనూ చ‌క్క‌గా న‌టించింది. పాట‌లు చాలా బాగా చిత్రీక‌రించారు. పాట‌లు తీసిన లొకేష‌న్ల‌న్నీ బావున్నాయి. హీరో, హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ ఆశించినంతగా ఆక‌ట్టుకోలేదు.

ఇక సినిమాలో మైన‌స్‌లు త‌క్కువేం లేవు. వైశాఖం అనే పేరు విన‌గానే ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ అనే విష‌యం మ‌న మ‌దిలో మెదులుతుంది. ప్రేమ‌క‌థ‌లో ఫీల్ స‌రిగా లేదు. హీరో, హీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే టామ్ అండ్ జెర్రీ ఫైట్ నిజ‌మైందేనా? లేకుంటే వారిద్ద‌రు క‌లిసి ఏమైనా నాట‌కాలు ఆడుతున్నారా ? వంటి అనుమానాలు త‌లెత్తుతాయి. అపార్ట్ మెంట్‌లోని వ్య‌క్తుల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సైతం వీక్‌గానే ఉన్నాయి. ఇక నిర్మాణ విలువ‌లు బావున్నాయి. పాట‌లు, పాట‌ల చిత్రీక‌ర‌ణ సినిమాకు హైలైట్‌.

అపార్ట్‌మెంట్స్‌లో రకరకాల మనుషులు వుంటారు. వాళ్ళ మధ్య వచ్చే క్లాషెస్‌, వాళ్ళ మధ్య వుండే రిలేషన్స్‌షిప్స్‌ అనేవి ఎలా వుంటాయి అనేది ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కురాలు జ‌య చెప్పాల‌నుకున్నా ఆమె ఎంచుకున్న క‌థ‌కు, తీసిన సినిమాకు న్యాయం జ‌ర‌గ‌లేదు.

ఫైన‌ల్ పంచ్‌: ఫీల్ మిస్ అయిన వైశాఖం

 

వైశాఖం మూవీ రేటింగ్‌: 2 / 5