ఎన్టీఆర్ ఎందుకు ఎక్కువ‌…బ‌న్నీ ఎందుకు త‌క్కువ‌..!

టాలీవుడ్‌లో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ఇద్ద‌రూ ఇద్ద‌రే. చాలా త‌క్కువ టైంలోనే వీరు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నారు. ఇద్ద‌రి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్మురేపుతున్నాయి. ఎన్టీఆర్ మూడు వ‌రుస హిట్ల‌తో హ్యాట్రిక్ కొట్టాడు. ఇక బ‌న్నీ సైతం వ‌రుస హిట్లు ఇస్తున్నాడు. అయితే వీరిద్ద‌రి వ్య‌క్తిత్వం, వ్య‌వ‌హ‌రించే తీరు ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది పెద్ద‌ల ద‌గ్గ‌ర కూడా పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సెల‌బ్రిటీల‌కు – ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధి మీడియానే..ఎంత గొప్ప సెల‌బ్రిటీ అయినా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యేదానిని బ‌ట్టే అత‌డికి మీడియా ద్వారా ప్ర‌జ‌ల్లో పాపులారిటీ ఉంటుంది. ఇక గ‌త కొద్ది రోజులుగా బ‌న్నీకి హిట్ల‌తో త‌న లెవ‌ల్ పెరిగింది అనుకుంటున్నాడో ? ఏమోగాని అటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్‌తోను, ఇటు మీడియాతోను అంత‌రం పెంచుకుంటున్నాడు.

తాజాగా బ‌న్నీ డీజే సినిమా ప్ర‌మోష‌న్ ఇంట‌ర్వ్యూల్లో ఏకంగా మీడియానే క‌ట్ట‌డి చేయ‌డం మీడియా వ‌ర్గాల్లో బ‌న్నీపై తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. డీజే ప్ర‌మోష‌న్స్‌లో త‌న పీఆర్ టీంను ప‌క్క‌న పెట్టుకుని ఈ ప్ర‌శ్న‌లే వేయండి..ఇంత‌కు మించి అడ‌గొద్దు… 5 నిమిషాలే మీకు టైం ఇస్తున్నామ‌న్న కండీష‌న్ల‌తో మీడియా వ‌ర్గాలు అవాక్క‌య్యాయి. ఇక సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూవ‌ర్ల‌పై డీజే టీం, బ‌న్నీ పీఆర్ వ‌ర్గాలు రెచ్చిపోయాయి. మీడియాకే పాఠాలు చెప్పాయి. దీంతో బ‌న్నీ అన‌వ‌స‌రంగా గోటితో పోయేదాన్ని గొడ్డ‌లితో న‌రుక్కున్న‌ట్లు చేసుకుంటున్నాడ‌న్న విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

ఇక ఇదే టైంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకు హోస్ట‌ర్‌గా చేస్తున్నాడు. తెలుగులో పెద్ద ట్రెండ్ సెట్ చేస్తుంద‌ని భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇంత పెద్ద షో జ‌రుగుతుందంటే ఎన్టీఆర్‌కు, ఈ ప్రోగ్రామ్ నిర్వాహ‌కుల‌కు మ‌ధ్య ఎన్ని సిట్టింగులు, ఎన్ని డీల్స్ జ‌రిగి ఉంటాయో స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ షో ఎనౌన్స్‌మెంట్‌పై మీడియాతో మీట్ అయిన ఎన్టీఆర్ ఓ కామ‌న్ మీడియా ప‌ర్స‌న్‌కు కూడా ప‌బ్లిక్‌గా థ్యాంక్స్ చెప్పి అంద‌రి మ‌న‌స్సులు గెలుచుకున్నాడు.

మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చాలా చ‌క్క‌గా, ఎంతో ఓప్పిగా స‌మాధానాలు చెప్పాడు. త‌న భార్య‌, కుమారుడు గురించి కూడా ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసి ఆక‌ట్టుకున్నాడు. ఇలా ఎన్టీఆర్ రోజు రోజుకు అంద‌రికి ద‌గ్గ‌ర‌వుతుంటే, బ‌న్నీ మాత్రం లేనిపోని కాంట్ర‌వ‌ర్సీలు కొని తెచ్చుకుని దూర‌మ‌వుతున్నాడు. చిన్న ఉదాహ‌ర‌ణ ఎన్టీఆర్ చివ‌రి మూడు హిట్ సినిమాలు పెద్ద కంటెంట్‌తో వ‌చ్చిన‌వేం కాదు.. అయితే అందులో ఎన్టీఆర్ అసాధార‌ణ న‌ట‌న‌, అత‌డి వ్య‌క్తిత్వంతోనే అవి సూప‌ర్ హిట్లు అయ్యాయి.

ఇక బ‌న్నీ డీజే సినిమా చాలా వీక్ కంటెంట్‌తో ఉంది. ఆ సినిమాకు బ‌న్నీ క్రేజ్ కేవ‌లం ఓపెనింగ్స్ తెచ్చిపెట్ట‌డానికే ప‌రిమిత‌మైందే త‌ప్ప సినిమాను హిట్ చేయ‌లేదు. ఇందుకు అత‌డి వ్య‌క్తిత్వ‌, వ‌రుస హిట్ల‌తో అత‌డి ప్ర‌వర్త‌న‌లో వ‌చ్చిన మార్పులు కూడా కార‌ణ‌మ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో న‌డుస్తోంది.