ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్‌: క‌లువ‌పూడి శివ‌ – ఉండి

ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాల‌మ్‌లో భాగంగా ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంక‌ట‌శివ‌రామరాజు (క‌లువ‌పూడి శివ) ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఉండి నుంచి 2009లోను, 2014లోను వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివ నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన అభివృద్ధి ప‌నులు ఏంటి ? శివ‌కు అక్క‌డ ఉన్న అనుకూల‌, వ్య‌తిరేకాంశాలేమిటో చూద్దాం.

త‌న‌నియోజ‌క‌వ‌ర్గంలో రైతులు క‌రెంటు బాధ‌ల‌తో బాధ‌ప‌డుతుంటే మండుటెండ‌లో కంక‌ర‌రాళ్ల మీదే స‌బ్‌స్టేష‌న్ ముందే బైఠాయించాడు. ఎర్ర‌గా బొబ్బ‌లెక్కిన కాళ్ల‌తో ర‌క్తం కారుతున్నా శివ మాత్రం లెక్క‌చేయ‌లేదు. చివ‌ర‌కు అప్ప‌టి కాంగ్రెస్ సీఎం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అక్క‌డ స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌క త‌ప్ప‌లేదు. ప్ర‌స్తుతం ఏపీలో ఏ నియోజ‌క‌వ‌ర్గానికి లేని విధంగా 24 గంట‌ల త్రీ పేస్ విద్యుత్ సౌక‌ర్యం ఒక్క ఉండి నియోజ‌క‌వ‌ర్గానికి మాత్ర‌మే ఉందంటే అదంగా శివ క్రెడిట్టే. ఇక ఓ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో 100 శాతం టాయ్‌లెట్లు ఉన్న ఘ‌న‌త కూడా ఉండి నియోజ‌కవ‌ర్గానికే ద‌క్కుతుంది.

ఉండి శివ‌ను చాలా మంది మొండి శివ‌గా పిలుస్తారు. ఈ ఒక్క సంఘ‌ట‌నే ప్ర‌జా స‌మ‌స్యల ప‌రిష్కారంలో శివ‌కు ఉన్న క‌మిట్‌మెంట్ ఎలాంటిదో చెపుతుంది. ఇటీవ‌ల ఓ సాధార‌ణ కార్య‌క‌ర్త గాయ‌ప‌డితే అత‌డి ట్రీట్‌మెంట్‌కు ల‌క్ష‌ల్లో అయిన ఖ‌ర్చు మొత్తం శివే భ‌రించాడు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇంటింటికీ పూలు, కూర‌గాయ‌ల మొక్క‌ల పంపిణీ, పుంతరోడ్ల అభివృద్ధికి విదేశాల నుంచి యంత్రాలు ర‌ప్పించి బాగు చేయ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో కోట్లాది రూపాయ‌ల అభివృద్ధి ప‌నులు, ప‌క్కా రోడ్లు, మ‌హిళ‌ల కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు, కిందిస్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల వ‌ర‌కు అంద‌రితోను స‌త్స‌బంధాలు శివ‌కు చాలా ప్లస్ కానున్నాయి.

రాజ‌కీయంగా పార్టీ అధిష్టానం వ‌ద్ద తిరుగులేని మార్కులు శివ సొంతం. చంద్ర‌బాబు సొంత సర్వేలో ప్ర‌థ‌మ ర్యాంకు ద‌క్కించుకున్న శివ జాతీయ స్థాయిలో సైతం ఉత్త‌మ ఎమ్మెల్యే అవార్డు అందుకుని రాజ‌కీయ వ‌ర్గాల‌ను మెస్మ‌రైజ్ చేశాడు. అయితే త‌న స్థాయికి త‌గిన గుర్తింపు పార్టీలో ఇంకా రావ‌డం లేద‌ని, మంత్రి ప‌ద‌వి రాలేద‌న్న అసంతృప్తి ఆయ‌న‌లో అంత‌ర్గ‌తంగా తీవ్రంగా ఉంది.

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కేరాఫ్ శివ‌

– ప‌ని అయ్యేవ‌ర‌కు వ‌ద‌ల‌ని మ‌న‌స్తత్వం

– కార్య‌క‌ర్త‌ల మ‌నిషి

– శివ‌ కృషితో జిల్లాలోనే త‌ల‌స‌రి ఆదాయంలో ఉండి టాప్‌

– జాతీయ స్థాయిలో ఉత్త‌మ ఎమ్మెల్యే అవార్డు

– చంద్ర‌బాబు ర్యాంకింగ్‌లో గ‌త ఏడు సంవ‌త్స‌రాల్లో టాప్‌-5లో ఉండ‌డం

– నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డం

మైన‌స్ పాయింట్స్ (-) :

– రెండుసార్లు గెలిచినా మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డం

– జిల్లాలో రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిచినా అధిష్టానం దృష్టిలో స‌రైన గుర్తింపు లేక‌పోవ‌డం

– రాష్ట్ర స్థాయిలో మాస్ లీడ‌ర్‌గా ఎద‌గ‌లేక‌పోవ‌డం

తుది తీర్పు:

శివ‌కు నియోజ‌క‌వ‌ర్గంలో సాధార‌ణ జ‌నాల నుంచి అతి సాధార‌ణ కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు తిరుగులేని ప‌ట్టు ఉంది. ఇక అక్క‌డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పాత‌సాటి స‌ర్రాజు శివ‌కు పోటీ ఇచ్చే ప‌రిస్థితుల్లో ప్ర‌స్తుతం ఉన్నాడా ? అన్న సందేహాలు కూడా ఉన్నాయి. అస‌లే ప‌శ్చిమ‌గోదావ‌రి జ‌ల్లాలో వైసీపీ వీక్ అంటే ఉండిలో చాలా చాలా వీక్ అన్న‌ట్టుగా ఉంది.

ప్ర‌స్తుతం ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో శివ చేసిన అభివృద్ధి ప‌నుల‌తో పాటు అక్క‌డ రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుంటే ఎమ్మెల్యేగా శివ 2019 ఎన్నిక‌ల్లోను విజ‌యం సాధించి హ్యాట్రిక్‌తో అసెంబ్లీలో అడుగు పెట్ట‌డంలో డౌట్ లేద‌నిపిస్తోంది. అప్ప‌టి రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఎంత మారినా మ‌హా అయితే శివ‌కు మెజార్టీ కాస్త పెర‌గొచ్చు…లేదా త‌గ్గొచ్చు. శివ గెలుపు మాత్రం క‌న్‌ఫార్మ్‌గా క‌నిపిస్తోంది.