గురు TJ రివ్యూ

సినిమా : గురు

నటీనటులు : వెంకటేష్‌, రితిక సింగ్‌, నాజర్‌, ముంతాజ్‌ సర్కార్‌, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి, జాకీర్‌ హుస్సేన్‌ తదితరులు

కథనం : సుధ కొంగర, సునంద రఘునాధన్‌

మాటలు : హర్షవర్ధన్‌

ఛాయాగ్రహణం : కె.ఏ. శక్తివేల్‌

సంగీతం : సంతోష్‌ నారాయణన్‌

కథ, దర్శకత్వం : సుధ కొంగర

తెలుగు ఇండ్రస్ట్రీ లో రీమేక్ సినిమాలు చేసి విజయాలు అందుకొన్న హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ మాత్రమే, తన పేరునే విజయంగా మార్చుకొని దూసుకుపోతున్న టాలీవుడ్ టాప్ హీరో. తన సినీ ప్రస్థానంలో తన వయసుకు సరిపడా ఎలాంటి క్యారెక్టర్ ఎంచుకోవాలో అలాంటి క్యారెక్ట్ ఎంచుకొంటూ తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే వెంకటేష్ కొత్తగా నటించిన గురు సినిమా ‘సాలా ఖడూస్‌’కి రీమేక్‌. తెలుగు ఇండస్ట్రీ లో క్రీడల నేపథ్యంలో వచ్చిన సినిమాలు మనం వేళ్ళ మీద లెక్కించవచ్చు. ఒకవేళ వచ్చినా క్రీడ అనేది అదనపు ఆకర్షణే అయ్యేది. బాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలు మాత్రమేకాదు కాదు స్పోర్ట్స్ ఆధారంగా సినిమాలు చేసి కోట్లు కలెక్ట్ చెయ్యొచ్చు అని మరో ఒకసారి ప్రూవ్ చేసారు ‘సాలా ఖడూస్‌’ తో. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ కూడా క్రీడా సినిమాల వైపు వెళుతుంది. అందులో భాగంగా తెరకెక్కిన చిత్రమే ‘గురు’.. అక్కడ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధా కొంగర.. ‘గురు’ని కూడా తెరకెక్కించే బాధ్యత తీసుకొన్నారు. మరి తెలుగులో ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఎంత వరకు పండింది? మాధవన్‌ పాత్రకు వెంకీ ఎంత వరకు న్యాయం చేశారో చూదాం ..!

కధ:

ఆదిత్య (వెంకటేష్ ) బాక్సింగ్ అంటే ప్రాణం ,ముక్కుసూటి,ముక్కోపి అయిన ఒక సిన్సియర్ బాక్సింగ్ కోచ్ ,కొందరి స్వార్ధం వలన బాక్సింగ్ ఛాంపియన్ కావలసినవాడు ఒక కోచ్ గా మిగిలిపోతాడు .అలాంటి స్వార్ధ రాజకీయాల మధ్య ఎలాంటి ప్రాముఖ్యత లేని వైజాగ్ బాక్సింగ్ అకాడమీ కి ఆదిత్యని పంపుతారు .అక్కడ రాముడు (రితికా సింగ్‌) కుటంబాన్ని పోషిస్తూ తన అక్క లక్స్‌ కు (ముంతాజ్‌) ఎలాగైనా స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఉద్యోగం సంపాదించాలనే ద్యేయంతో కూరగాయలు అమ్ముతున్న రాముడు గురుకి కనిపిస్తుంది .రాముడు లోని బాక్సింగ్ టాలెంట్ని కనిపెట్టిన గురు రాములుకి కొంత డబ్బులిచ్చి కోచింగ్ కి తీసుకువస్తాడు .అయితే అల్లరి పిల్ల అయిన రాముడు గురు మీద కోపంతో కావాలనే బాక్సింగ్ పోటీల్లో ఓడిపోద్ద, అలాంటి అమ్మాయిని గురు ఎలా బాక్సింగ్ వైపు మలిచాడు, రాముడుని వరల్డ్ ఛాంపియన్ చేయటానికి ఎదురయిన సమస్యలను గురు ఎలా ఎదుర్కొన్నాడు అనేదే కధ .

విశ్లేషణ ;
మనం మొదట మాట్లాడుకోవాల్సింది వెంకటేష్ గురించి బాక్సింగ్ కోచ్ ఆదిత్య పాత్రలో సూపర్ గా నటిచాడనే చెప్పాలి, ఎంతగా అంటే తెలుగులో ఆ క్యారక్టర్ కి వెంకటేష్ తప్ప మరో హీరో సరిపోడు అన్నంతగా. ఎమోషనల్ సీన్స్ లో వెంకటేష్ నటన ప్రేక్షకులను సినిమాకి బాగా కనెక్ట్ అయేట్టు చేస్తాయి. కధకి ప్రాణం అయిన రాముడు క్యారక్టర్ కు రితిక సింగ్ నిజంగా ప్రాణం పోసింది, ‘సాలా ఖడూస్‌’లో చేయటంవలన రాముడు పాత్ర తనకు కేక్ వాక్ అయ్యింది అనే చెప్పాలి .అల్లరి పిల్లగా , బస్తి లోఅమ్మాయిగా సూపర్ గా నటిచింది .తన అక్క పాత్రలో ముంతాజ్ తన క్యారెక్ట్ కి న్యాయం చేసింది . ఇక నాజర్ మన తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు ,నాజర్ జూనియర్ కోచ్ గా చాల అద్భుతం గా చేసాడని చెప్పొచ్చు . తనికెళ్ళ భరణి ,రఘుబాబు మిగిలిన తదితర నటులు వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు . మనం ఒక్కరి గురించి బాగా మాట్లాడుకోవాలి ,ఆ ఒక్కరు ఎవరంటే డైరెక్టర్ సుధా కొంగర.ఏదో స్పోర్ట్స్ సినిమాలో బాక్సింగ్ గురించి ఒక ఫైట్ పెట్టాం ,మిగిలింది ప్రేమ , వినోదం తో కధ నడిపించాం అన్నట్టు కాకుండా ,నిజం గా క్రీడా సినిమాలు అంటే క్రీడే ప్రధానాంశంగా చేసుకొని ఎక్కడ కధ పక్క దారి పట్టకుండా సినిమా నడిపిన విధానం బాగుంది. సినిమాలో పాటలు కూడా కథానుసారంగా వస్తాయి. సంగీత దర్శకుడు సంతోష నారాయణ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా కు ప్లస్ అయ్యింది. స్క్రీన్ ప్లే బాగుంది, మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్ని బాగా చేసారు.

‘గురు’ రీమేక్ సినిమా అయినప్పటికీ ఎక్కడా నేటివిటీ మిస్సుకాకుండా తెలుగు ప్రేక్షకులకు అందించటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

పంచ్ లైన్ : సూపర్ పంచ్ గురు

రేటింగ్ ; 3.5/ 5