విజ‌య్ దేవ‌ర‌కొండ ఎందుకు ఈ త‌ల‌పొగ‌రు..!

August 22, 2017 at 9:40 am
vijay deverakonda

అవును! అర్జున్‌రెడ్డి మూవీ హీరో.. విజ‌య్‌దేవ‌ర కొండ‌కు పొగ‌రు త‌ల‌కెక్కింద‌నే కామెంట్లు టాలీవుడ్ లో ర‌న్ అవుతున్నాయి. విజ‌య్ హీరోగా గ‌తంలో వ‌చ్చిన పెళ్లి చూపులు మూవీని అంద‌రూ ఇష్ట‌ప‌డి హిట్ చేశారు. దీంతో మ‌నోడు అస్స‌లు ఇప్పుడు భూమ్మీద ఆగ‌డం లేదు. తానేదో టాలీవుడ్‌లో తోపున‌ని అనుకుంటున్న‌ట్టు బిహేవ్ చేశాడు తాజాగా జ‌రిగిన అర్జున్ రెడ్డి ఫంక్ష‌న్‌లో. సోమవారం రాత్రి అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా స్టేజ్ ఎక్కి మైకు ప‌ట్టుకున్న విజ‌య్ నోటి వెంట‌.. నానా బూతులు అల‌వోక‌గా వ‌చ్చేశాయి. తానే మోనార్క్ అనే రేంజ్‌లో మాట‌ల తూటాల‌తో రెచ్చిపోయాడు.

గతంలో పెళ్లి చూపులు సంద‌ర్భంగా తాను చేసిన కామెంట్స్ ఎందుకు నచ్చలేదో అర్ధం కాలేదన్నాడు. అప్పట్లో ట్రైలర్ లాంచ్ అప్పుడు.. విజ‌య్‌ తన సినిమా పెట్టుబ‌డి మొత్తాన్ని.. బెట్ పెట్టేస్తానని.. అంత బాగా వచ్చిందని చెప్పాడు. దాంతో అందరూ విజ‌య్‌కి బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. అయితే, అప్ప‌ట్లో ఈ కామెంట్ల‌కు సైలెంట్‌గా ఉన్న విజ‌య్‌.. ఇప్పుడు తాజా మూవీ ఫంక్ష‌న్ సంద‌ర్భంగా.. స్టేజ్ మీద బూతులు మాట్లాడుతూ.. మ‌రీ అప్ప‌టి ఘ‌ట‌ను ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. ”f*ck.. నేను ఎవ్వరికీ అపాలజీ చెప్పను. నా సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండకపోతే ఎవరికి ఉంటుంది? మీరు ( స్టూడెంట్స్ ) కూడా మీ లైఫ్ లో అలాగే ఉండండి. అని గీతోప‌దేశం చేశాడు.

మ‌నం.. ఎవ్వరికీ తలవంచాల్సిన అవసరం లేదు. వినయపూర్వకంగా ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు.. f*ck హుమిలిటి” అంటూ కామెంట్ చేశాడు విజయ్. ప్ర‌స్తుతం రెచ్చిపోయే సీన్లున్న అజ‌య్ రెడ్డి మూవీకి సంబంధించి మాట్లాడుతూ.. సెన్సార్ బోర్డు వారు మా—ద్ అనే పదాన్ని మ్యూట్ చేయడం తీవ్రంగా బాధించింద‌న్నారు. ”మన గాళ్ ఫ్రెండ్ లేదా చెల్లెను ఎవరన్నా కామెంట్ చేస్తే అదే మాట వాడతాం. కాని ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు మాత్రం ఆ విషయం ఒప్పుకోవట్లేదు. అందుకే నా వాయిస్ ఆపేశారు సరే.. ధియేటర్లో రేపు మీ (స్టూడెంట్స్) వాయిస్ ఆపలేరుగా. అందుకే ఆ పదం దగ్గర మీరు డబ్బింగ్ చెప్పండి” అని చెబుతూ.. విద్యార్థుల‌ను రెచ్చ‌గొట్టాడు.

మొత్తానికి అంత పెద్ద ఆడియన్స్ ను చూసేపాటికి కాస్త సంయమనం కోల్పోయాడో లేకపోతే తాను ఆల్రెడీ సూపర్ స్టార్ అయిపోయాను అనుకున్నాడో తెలియదు కాని.. విజయ్ దేవరకొండ మాత్రం కాస్త శృతిమించేశాడు. నిజానికి పెద్ద పెద్ద హీరోలు నటులు ఎవ్వరూ కూడా ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఇలా f*ck అంటూ బూతులు మాట్లాడరు. ఆ లిమిట్ క్రాస్ చేసి సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడో అతనికే తెలియాలి. దీంతో ఇప్పుడు టాలీవుడ్ లోనే విజ‌య్‌పై కామెంట్లు కురుస్తున్నాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌నే ల‌క్ష‌ణం అల‌వ‌రుచుకో త‌మ్ముడూ అంటూ హిత‌వు ప‌లుకుతున్నారు. మ‌రి ఏం చేస్తాడో ఈ యువ హీరో చూడాలి.

 

విజ‌య్ దేవ‌ర‌కొండ ఎందుకు ఈ త‌ల‌పొగ‌రు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts