వీఐపీ 2 TJ రివ్యూ

టైటిల్‌: వీఐపీ 2

బ్యాన‌ర్‌: వి క్రియేష‌న్స్‌, వండ‌ర్ బార్ ఫిలింస్‌

న‌టీన‌టులు: ధ‌నుష్‌, కాజోల్‌, అమ‌లాపాల్‌, సముద్ర‌ఖ‌ని, వివేక్ త‌దిత‌రులు

మ్యూజిక్‌: సేన్ రోల్డ‌న్‌

ఎడిటింగ్: ప్ర‌స‌న్న జి.కె

నిర్మాత‌లు: ధ‌నుష్‌, క‌లైపులి థాను

ద‌ర్శ‌క‌త్వం: సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్‌

రిలీజ్ డేట్‌: 25 ఆగ‌స్టు, 2017

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అల్లుడు ధ‌నుష్ న‌టించిన ర‌ఘువ‌ర‌న్ బీటెక్ సినిమా త‌మిళ్‌, తెలుగు భాష‌ల్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెర‌కెక్కిన సినిమా వీఐపీ 2. ఇప్ప‌టికే కోలీవుడ్‌లో రిలీజ్ అయ్యి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ రోజు తెలుగులో వీఐపీ 2గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సీక్వెల్‌కు ధ‌నుష్ క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందించ‌గా, ర‌జ‌నీకాంత్ త‌న‌య సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ సినిమాను డైరెక్ట్ చేశారు. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాలు ఎంత వ‌ర‌కు అందుకుందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

వీఐపీ 2 ర‌ఘువ‌ర‌న్ బి.టెక్ సీక్వెల్ సినిమా కావ‌డంతో అదే క్యారెక్ట‌ర్స్ ఈ సినిమాలోను ఉంటుంది. ర‌ఘువ‌ర‌న్ (ధ‌నుష్‌) ఓ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీలో ప‌నిచేస్తూ బెస్ట్ ఇంజ‌నీర్ అవార్డు గెలుచుకుంటాడు. ఈ అవార్డుతో ర‌ఘువ‌ర‌న్ సౌత్ ఇండియాలోనే అతి పెద్ద కంపెనీకి ఎండీ అయిన వసుంధర పరమేశ్వరన్ (కాజోల్) దృష్టిలో పడతాడు. వ‌సుంధ‌ర అత‌డిని ఎలాగైనా త‌మ కంపెనీలోకి తీసుకు రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంది.

ఆమె ఆఫ‌ర్‌ను అత‌డు తిర‌స్క‌రించ‌డంతో పాటు ఆమె ద‌క్కించుకోవాల‌నుకున్న కాంట్రాక్టునే సొంతం చేసుకుంటాడు. దీంతో ర‌ఘువ‌ర‌న్ ప‌ని చేస్తోన్న కంపెనీని దెబ్బ‌తీసేందుకు వ‌సుంధ‌ర ప్లాన్ చేస్తుంది. ఆ కంపెనీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ బిజినెస్‌ను దెబ్బ కొట్టేలా ప్లాన్స్ చేస్తుంది. కంపెనీ న‌ష్టాలు పాల‌వ్వ‌డంతో ర‌ఘువ‌ర‌న్ త‌న ఉద్యోగానికి రిజైన్ చేస్తాడు.

ఆ త‌ర్వాత అత‌డు సొంతంగా వీఐపీ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీని స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వ‌సుంధ‌ర ఏం చేస్తుంది ? ర‌ఘువ‌ర‌న్‌కు ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌వుతాయి? ర‌ఘువ‌ర‌న్ త‌న క‌ష్టాల‌ను ఎలా దాటుతాడు ? ఆమెకు ఎలా బుద్ధి చెప్పాడు అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

విశ్లేష‌ణ :

ఈ సినిమాకు ధ‌నుష్‌, కాజ‌ల్ క్యారెక్ట‌ర్స్ మెయిన్ పిల్ల‌ర్స్‌గా నిలిచాయి. ఇద్ద‌రూ పోటాపోటీగా న‌టించారు. తొలి భాగంలో నిరుద్యోగిగా క‌నిపించిన ధ‌నుష్ ఈ సినిమాలో సివిల్ ఇంజ‌నీర్ పాత్ర‌లో న‌టించారు. అమ‌లాపాల్ అంటే ప్రేమ‌, భార్య అంటే భ‌య‌ప‌డే భ‌ర్త పాత్ర‌లో ధ‌నుష్ న‌టన మెప్పించింది. సినిమాలో ఫ‌స్టాఫ్ ఆస‌క్తిగా న‌డుస్తుంది. సినిమాలో ధ‌నుష్‌, కాజోల్ మ‌ధ్య పోటీ సినిమాలో రాను రాను సైడ్ ట్రాక్ ప‌ట్టేస్తుంది. ఇక 40 ఏళ్ల వ‌య‌స్సులో కూడా కాజ‌ల్ వ‌న్నె త‌గ్గ‌ని అందంతో చేసిన న‌టన సూప‌ర్బ్‌.

ఈగో క‌ల బిజినెస్ ఉమెన్‌గా ధ‌నుష్‌తో పంతం వేసి అత‌డిని అణ‌గ‌దొక్కేందుకు చేసే సీన్లు ఆక‌ట్టుకున్నాయి. సినిమా స్టార్టింగ్‌లో ఉన్నా త‌ర్వాత ఆక‌ట్టుకోదు. సినిమా చివ‌రి వ‌ర‌కు సై అనేలా పోటీ ప‌డే కాజోలో చివ‌ర‌కు ఓ చిన్న డిస్క‌ష‌న్‌తో మంచిదానిలా మారిపోవ‌డం ఏంటో ప్రేక్ష‌కుల‌కు అర్థం కాదు.

సాంకేతికంగా…

ర‌ఘువ‌ర‌న్ బి.టెక్‌లో ట్యూన్స్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి. అయితే సెకండ్ పార్ట్‌లో రోల్డ‌న్ సంగీతం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. స‌మీర్ తాహిర్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. నిర్మాణ విలువ‌లు ఓకే. ఇక సినిమాలో క‌థ‌, క‌థ‌నం దాదాపు ఫ‌స్ట్ పార్ట్‌ను త‌లపిస్తుంటుంది. ర‌ఘువ‌ర‌న్ బీటెక్ సినిమాకు సీక్వెల్ తీయాల‌ని ధ‌నుష్ రాసుకున్న క‌థ‌లో కేవ‌లం కాజ‌ల్ పాత్ర త‌ప్ప ఏ పాత్ర ఎంగేజింగ్‌గా లేదు. ఇక ఫ‌స్టాఫ్‌లో కొంత భాగం మిన‌హా మిగిలిన సినిమా అంతా ప‌ర‌మ‌సోదిగా ఉంది. ఇక సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వం ప్ర‌తిభ గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మొత్తం మీద ర‌ఘువ‌ర‌న్ బి.టెక్ కంటే విఐపి2 ఆశించిన మేర అభిమానుల‌ను ఆక‌ట్టుకోదు.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– కాజ‌ల్‌

– ధ‌నుష్ యాక్టింగ్‌

మైన‌స్ పాయింట్స్ (-):

– స్టోరీ

– చెత్త డైరెక్ష‌న్‌

– ఎంగేజింగ్‌గా లేని స్క్రీన్ ప్లే

– బోరింగ్ సెకండాఫ్‌

ఫైన‌ల్ పంచ్‌: వీఐపీ 2 బిగ్‌ బోరింగ్ సీక్వెల్

వీఐపీ 2 TJ రేటింగ్‌: 1.75 / 5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre