అప్పుడు బాల‌య్య‌తో ఇప్పుడు నాగార్జున ర‌వితేజ‌కు గ్యాప్ ఎందుకు..!

September 22, 2017 at 1:07 pm
Raviteja, Nagarjuna

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కింగ్ నాగార్జున‌కు, మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కు మ‌ధ్య జ‌రుగుతోన్న కోల్డ్‌వార్ గురించి టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో నాగార్జున‌, ర‌వితేజ చాలా స‌న్నిహితంగా ఉండేవారు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య కోల్డ్‌వార్ అఖిల్ సినిమా రిలీజ్ టైం నుంచి స్టార్ట్ అయిన‌ట్టు స‌మాచారం.

అఖిల్ సినిమా అఖిల్ డెబ్యూ మూవీ. ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య 2015 ద‌స‌రాకు వ‌చ్చింది. ఈ సినిమా రోజునే ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అఖిల్‌ సినిమా కోసం థియేట‌ర్లు దొర‌కుండా చేసి బ‌ల‌వంతంగా నాగార్జునే వాయిదా వేయించాడ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. పైకి అంతా సామ‌ర‌స్యంగానే జ‌రిగింద‌ని చెప్పినా వెన‌క నాగ్ ప్రెజ‌ర్ గ‌ట్టిగానే ప‌నిచేసింద‌ట‌.

అప్ప‌టి నుంచి నాగార్జున‌కు, ర‌వితేజ‌కు మ‌ధ్య స‌ఖ్య‌త లేద‌ట‌. ఇక ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన సినిమా రాజా ది గ్రేట్ అక్టోబ‌ర్ 12న వ‌స్తోంది. ఆ మ‌రుస‌టి రోజు నాగార్జున ప్రధాన పాత్ర‌ పోషించిన రాజుగారి గది 2 వ‌స్తోంది. ముందు ర‌వితేజ సినిమా డేట్ ఎనౌన్స్ చేయ‌గా, త‌ర్వాత రాజుగారి గ‌ది 2 డేట్ ఎనౌన్స్ చేశారు. దీంతో ర‌వితేజ త‌న స‌న్నిహితుల వ‌ద్ద నాగార్జున తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశాడ‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది.

అస‌లే రెండేళ్ల త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావడంతో సోలోగా వ‌ద్దామ‌నుకుంటే ఇప్పుడు నాగ్ మ‌ళ్లీ త‌న‌కు పోటీగా రావ‌డం ర‌వితేజ‌కు న‌చ్చ‌లేద‌ట‌. ర‌వితేజ‌కు మ‌రో సీనియ‌ర్ మీరో బాల‌య్య‌కు గ‌తంలో ఓ హీరోయిన్ విష‌యంలో గొడ‌వ జ‌రిగింద‌ని అప్పుడు ర‌వితేజ ప‌దే ప‌దే బాల‌య్య సినిమాల‌కు పోటీగా త‌న సినిమాలు రిలీజ్ చేయించేవాడ‌న్న రూమ‌ర్ ఉంది.ఇక ఇప్పుడు నాగార్జున‌తో కూడా ఇలా గ్యాప్ రావ‌డం మ‌నోడికి ఇబ్బందిక‌ర‌మే.

 

అప్పుడు బాల‌య్య‌తో ఇప్పుడు నాగార్జున ర‌వితేజ‌కు గ్యాప్ ఎందుకు..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts