చేతులు క‌లిసినా…మ‌న‌స్సులు క‌ల‌వ‌ని ఎంపీ -ఎమ్మెల్యే

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు ఓ ప్రాధాన్య‌త ఉంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోట‌గా ఉంటోన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు చూస్తుంటే ప్ర‌ధాన పార్టీల నాయ‌కుల మ‌ధ్య చేతులు క‌లిసినా…మ‌న‌స్సులు మాత్రం క‌ల‌వ‌డం లేదు. అధికార టీడీపీ విష‌యానికే వ‌స్తే ఇక్క‌డ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీత‌ల సుజాత వ‌ర్గాలు ఉన్నాయి. ఈ రెండు వ‌ర్గాల‌కు అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఒక‌రు ఎడ్డెం అంటే మ‌రొక‌రు తెడ్డం అనే ప‌రిస్థితి ఉంది.

ఈ రెండు వ‌ర్గాల ఫైటింగ్‌లో చివ‌ర‌కు ఏఎంసీ చైర్మ‌న్ పాల‌క‌వర్గం కూడా నియామ‌కం జ‌ర‌గ‌లేదు. జిల్లాలో చాలా ఏఎంసీలు ఒక ద‌ఫా పాల‌న పూర్తి చేసుకుని వ‌రుస‌గా రెండోసారి కూడా ప్ర‌మాణ‌స్వీకారం చేసినా ఇంకా చింత‌ల‌పూడి ఏఎంసీ పాల‌క‌వ‌ర్గం మాత్రం పెండింగ్‌లోనే ఉందంటే ఇక్క‌డ టీడీపీ దుస్థితి అర్థ‌మ‌వుతోంది. పీత‌ల‌కు అటు ఎంపీతోనే కాదు ఇటు ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌తోను భారీ గ్యాప్ ఉంది.

నియోజ‌క‌వ‌ర్గంలోని కామ‌ర‌వ‌పుకోట‌, లింగ‌పాలెం, చింత‌ల‌పూడి, జంగారెడ్డిగూడెం మండ‌లాల్లో టీడీపీ నాయ‌కులు ఎంపీ, ఎమ్మెల్యే వ‌ర్గాలుగా చీలిపోయి ఆధిప‌త్యం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో 20 నెల‌ల టైం మాత్ర‌మే ఉంది. అప్ప‌టి వ‌ర‌కు అయినా ఈ రెండు వ‌ర్గాలు మ‌న‌స్సులు క‌ల‌వ‌క‌పోతే ఆ ఎఫెక్ట్ చింత‌ల‌పూడి సీటు విజ‌యావ‌కాశాల‌పై ఖ‌చ్చితంగా ప‌డ‌నుంది.

వైసీపీలోను సేమ్ టు సేమ్…..

ఇక విప‌క్ష వైసీపీలోను అదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇక్క‌డ మాజీ ఎమ్మెల్యే ఘంటా ముర‌ళీకి, ఏలూరు లోక్‌స‌భ ఇన్‌చార్జ్‌, మాజీ మంత్రి కోట‌గిరి త‌న‌యుడు అయిన కోట‌గిరి శ్రీథ‌ర్ వ‌ర్గానికి పొస‌గ‌డం లేదు. వీరి మ‌ధ్య చేతులు క‌లుస్తున్నా మ‌న‌స్సులు మాత్రం అస్స‌లు క‌ల‌వ‌డం లేదు. వీరిద్ద‌రు నియోజ‌క‌వ‌ర్గంలో రెండు వ‌ర్గాల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ముర‌ళి చేతిలో శ్రీథ‌ర్ తండ్రి, మాజీ మంత్రి విద్యాధ‌ర‌రావుకు ఘోర ప‌రాజ‌యం ఎద‌రైంది. అప్ప‌టి నుంచి ముర‌ళి అంటే కోట‌గిరి వ‌ర్గానికి అస్స‌లు పొస‌గ‌దు.

ఆ త‌ర్వాత శ్రీథ‌ర్ ప‌లు పార్టీలు మారి వైసీపీలోకి రాగా, ఇటు ముర‌ళీ కూడా అంత‌కు ముందే కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వ‌చ్చారు. ఇప్పుడు వారిద్ద‌రి మ‌ధ్య పాత శ‌తృత్వం నేప‌థ్యంలో ఒకే పార్టీలో ఉన్నా మ‌న‌స్సులు క‌లిసే ప‌రిస్థితి లేదు. ఇటీవ‌ల దెందులూరు, చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గాల ప్లీన‌రీల‌కు ఈ ఇద్ద‌రూ హాజ‌రైన ఎడ‌మొఖం పెడ‌మొఖంగానే ఉన్నారు. ఇటు వీరి మ‌ధ్య గ్యాప్ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యావ‌కాశాల‌పై ప్ర‌భావం చూప‌నుంది.

ఓవ‌రాల్‌గా చూస్తే అటు అధికార పార్టీతో పాటు, ఇటు విప‌క్ష పార్టీలోను అస‌మ్మ‌తి రాగాలు గ‌ట్టిగానే ఉన్నాయి. మ‌రి ఈ ఇంట‌ర్న‌ల్ వార్ అంతిమంగా ఎవ‌రిని ముంచుతుందో ? ఎవ‌రిని తేల్చుతుందో చూడాలి.